జెరూసలేం, హజ్ యాత్రికుల ఆర్థికసాయం పెంచిన ఏపీ ప్రభుత్వం

AP Govt Hikes Financial Aid For Hajj And Jerusalem Pilgrims, AP Govt Hikes Financial Aid For Hajj Pilgrims, AP Govt Hikes Financial Aid For Jerusalem Pilgrims, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Govt Hikes Financial Aid For Hajj And Jerusalem Pilgrims, Hajj And Jerusalem Pilgrims, Mango News Telugu

జెరూసలేం, హజ్ వెళ్లే యాత్రికులకు ఆర్థిక సాయం పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నవంబర్ 19, మంగళవారం నాడు రెండు వేర్వేరు ఉత్తర్వులును ప్రభుత్వం జారీ చేసింది. జెరూసలేం సందర్శనార్థం వెళ్లే వారికి రూ.3 లక్షల్లోపు వార్షిక ఆదాయం కలిగి ఉంటే రూ.40 వేల నుంచి 60 వేలకు పెంచారు. అలాగే రూ.3 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారికి రూ.20 వేల నుంచి 30 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక హజ్‌ యాత్రికులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే ముందు ప్రభుత్వం పొందుపరిచిన నిబంధనలను పూర్తిగా చదివి, అందుకు అనుగుణంగా నిర్ణయించిన ఫార్మాట్‌లోనే ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని సూచించారు. హజ్‌ యాత్రకు వెళ్లే యాత్రికులకు రూ.3 లక్షల్లోపు లోపు వార్షికాదాయం ఉన్న వారికి రూ.60 వేలు,రూ.3 లక్షలకు పైగా ఉన్న వారికి రూ.30 వేలు చొప్పున ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =