ఏపీలో ఎంసెట్‌,ఐసెట్‌,ఈసెట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Andhra Pradesh Latest News, AP Breaking News, AP CET Entrance Exams Dates Of 2020, AP Goverment AP EAMCET Exams Date 2020, AP ICET Exams Date 2020, AP Political Live Updates 2020, Ap Political News, AP Political Updates, AP Political Updates 2020, Mango News Telugu

ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడులైంది. ఎంసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌ మరియు వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ డిసెంబర్ 30, సోమవారం నాడు తాడేపల్లిలో విడుదల చేశారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలతో పాటుగా, వీటిని నిర్వహించే యూనివర్సిటీలను కూడా ప్రకటించారు. ఎంసెట్ పరీక్షను ఈసారి జెఎన్టీయూ కాకినాడ నిర్వహిస్తుండగా, ఐసెట్ పరీక్షను ఎస్వీ యూనివర్సిటీ నిర్వహిస్తుంది.

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్:

  • ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ – ఏప్రిల్ 20,21,22,23,24
  • ఐసెట్‌ – ఏప్రిల్‌ 27
  • ఈసెట్‌ – ఏప్రిల్‌ 30
  • పీజీ ఈసెట్‌ – మే 2,3,4
  • లాసెట్‌ – మే 8
  • ఎడ్‌సెట్‌ – మే 9

అలాగే తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ ను డిసెంబర్ 24న ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్:

  • ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ – మే 5,6,7
  • ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీ – మే 9,11
  • ఐసెట్‌ – మే 20,21
  • ఈసెట్‌ – మే 13
  • పీజీ ఈసెట్‌ – మే 27,28,29,20
  • లాసెట్‌ – మే 25
  • పీజీ ఎల్ సెట్ – మే 25
  • ఎడ్‌సెట్‌ – మే 23

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 20 =