నేడు గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సమావేశమవనున్న ఏపీ సీఎం జగన్‌

AP CM YS Jagan To Meet Governor Biswabhusan Today to Discuss on Cabinet Reshuffle, AP CM YS Jagan To Meet Governor Biswabhusan Today, Governor Biswabhusan Today, Cabinet Reshuffle, Biswabhusan Harichandan, Governor of Andhra Pradesh, Biswabhusan Harichandan Governor of Andhra Pradesh, AP CM YS Jagan To Meet AP Governor Biswabhusan Harichandan Today, AP Cabinet reshuffle, YS Jagan Mohan Reddy Cabinet reshuffle, Cabinet reshuffle, AP Cabinet reshuffle Latest News, AP Cabinet reshuffle Latest Updates, AP Cabinet reshuffle Live Updates, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, AP CM, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు సమావేశం కానున్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న రాజధాని వెళ్లిన సీఎం జగన్ ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్‌ షా‌, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, గజేంద్రసింగ్ షెకావత్, నితిన్‌ గడ్కరీ వంటి పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను తెలిపి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అమలుచేయాల్సిన పథకాలపై చర్చించారు. నేటితో పర్యటనను ముగించుకుని ఈరోజు సాయంత్రం ఏపీకి రానున్నారు. అనంతరం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ తో సీఎం జగన్ భేటీ కానున్నారు.

త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్తీకరణ చేపట్టనున్న నేపథ్యంలో సీఎం జగన్, గవర్నర్‌ ‌తో భేటీ కావడం ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం పదవులలో ఉన్న మంత్రులలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారందరినీ మర్చి కొత్తవారికి అవకాశం ఇస్తున్నట్లు సీఎం జగన్ ఇదివరకే తెలిపారు. అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ ప్రతి జిల్లా నుంచి ఒక శాసనసభ్యుడిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం యోచిస్తున్నారు. దీనిలో భాగంగా రేపు కొందరు మంత్రులు రాజీనామా చేయొచ్చని తెలుస్తోంది. తదుపరి మిగిలిన మంత్రుల రాజీనామా కార్యక్రమం కొనసాగనుంది. ఈ క్రమంలో మంత్రుల రాజీనామాలను ఆమోదించే విషయమై ఈ రోజు భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి సమయం కోరాలని కూడా ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 11 గంటలకు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈమధ్య చేపట్టిన కొత్త జిల్లాల విషయం కూడా సీఎం జగన్ గవర్నర్‌ కు వివరించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here