రేపు పల్నాడులో పర్యటించనున్న సీఎం జగన్.. ‘ఫ్యామిలీ డాక్టర్’ కార్యక్రమం ప్రారంభం

CM YS Jagan To Inaugurate Family Doctor Programme Tomorrow at Chilakaluripet Palnadu District,CM YS Jagan To Inaugurate Family Doctor Programme,Family Doctor Programme Tomorrow at Chilakaluripet,CM YS Jagan to Chilakaluripet Palnadu District,Mango News,Mango News Telugu,YS Jagan Mohan Reddy,YS Jagan Tour Palanadu District,YS Jagan Palanadu News Today,YS Jagan Palanadu Latest News,YS Jagan Palanadu Latest Updates,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,Andhra Pradesh Politics,AP CM Jagan Latest News and Live Updates,AP Family Doctor Programme Live News

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (గురువారం, ఏప్రిల్ 05, 2023) పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా చిలకలూరిపేట మండలం, లింగంగుంట్ల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘ఫ్యామిలీ డాక్టర్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్ వైఎస్సార్ హెల్త్ విలేజ్ సెంటర్ ను పరిశీలిస్తారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసే ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్టు స్టాళ్ళను కూడా ఆయన సందర్శించనున్నారు. అనంతరం సమీపంలోని కావూరు గ్రామంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

కాగా ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రజలకు మొట్టమొదటిసారిగా ఆరోగ్య సంరక్షణ సేవలను అందించబోతోంది ప్రభుత్వం. తద్వారా నిరంతర మరియు సమగ్రమైన ఆరోగ్య సంరక్షణ సేవను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గతేడాది నుంచి దశలవారీగా అనేక ట్రయల్ రన్స్ నిర్వహించింది. దీంతో ప్రారంభానికి ముందే ఈ విధానంలోని లోపాలను పరిష్కరించేలా చూసింది. ప్రిన్సిపల్ సెక్రటరీ (ఆరోగ్యం, వైద్య మరియు కుటుంబ సంక్షేమం) కృష్ణబాబు విడుదల చేసిన విడుదల ప్రకారం, మార్చి 30, 2023 నాటికి 69.64 లక్షల మందికి పైగా ఈ కార్యక్రమం కింద సేవలను పొందారు. ఇక రాష్ట్రంలో 1,293 పీహెచ్‌సీలు ఉండగా ఒక్కో దానిలో ఇద్దరు డాక్టర్లు, 12 మంది పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. అయితే ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం కోసం ఏపీ ప్రభుత్వం కొత్తగా మరో 151 పీహెచ్‌సీ లను మంజూరు చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 7 =