వారాహి…రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ – జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Jana Sena Chief Pawan Kalyan Unveils his Campaign Vehicle Varahi Says Ready for Election Battle,Jana Sena Chief Pawan Kalyan,Campaign Vehicle Varahi,Varahi Vehicle,Mango News,Mango News Telugu,Varahi Ready for Election Battle,Campaign Vehicle Varahi,Varahi Campaign Vehicle,Campaign Vehicle Varahi News and Live Updates,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy, YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే యాత్రకు ప్రత్యేక వాహనం సిద్ధమవుతోంది. ఈ వాహనంకు సంబంధించిన వీడియోను బుధవారం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ, “వారాహి…రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్” అని ప్రకటించారు. యాత్రకు ఉపయోగించే వాహనానికి వారాహి అని నామకరణం చేశారు. ఈ వాహనాన్ని, ట్రయల్ రన్ ను పవన్ కళ్యాణ్ బుధవారం హైదరాబాద్ లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ వాహనానికి సంబంధించి పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు పవన్ కళ్యాణ్ కొన్ని ముఖ్య సూచనలు ఇచ్చారు. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోను చర్చించారు.

దుర్గాదేవి సప్త మాతృకల్లో ఒకరు, వారాహి:

ఈ వాహనానికి వారాహి అమ్మవారి పేరుపెట్టారు. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతాయి. దుర్గా దేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు. ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు.

వారాహి విశేషాలు ఇవే:

ప్రత్యేక లైటింగ్, ఆధునిక సౌండ్ సిస్టమ్స్:

“వారాహి వాహనాన్ని ప్రత్యేక భద్రత చర్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దారు. పవన్ కళ్యాణ్ పర్యటనలు చేసిన సందర్భంలో విద్యుద్దీపాలు ఆర్పి వేసి కక్ష సాధింపు చర్యలకు దిగే సంస్కృతినీ చూస్తున్నాం. ఇటీవల విశాఖపట్నం పర్యటన సందర్భంలో వీధి దీపాలు ఆర్పివేసిన విషయం విదితమే. వారాహి వాహనంపై ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. వాహనం నుంచి పవన్ కళ్యాణ్ ప్రసంగించే సందర్భంలో లైటింగ్ పరమైన ఇబ్బందులు లేకుండా వాహనం చుట్టూ లైట్లు ఏర్పాట్లు చేశారు. ఆధునిక సౌండ్ సిస్టం వినియోగించారు. వేల మందికి స్పష్టంగా పవన్ కళ్యాణ్ ప్రసంగం వినిపించే విధంగా ఈ సౌండ్ సిస్టం ఉంటుంది. వారాహి వాహనానికి నలువైపులా సీసీ కెమెరాలు అమర్చారు. వాహనం నిలిపిన, సభ నిర్వహించే ప్రదేశంలో పరిస్థితి రికార్డయ్యే ఫుటేజ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వర్ కి రియల్ టైంలో వెళ్తుంది. 2008 నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పర్యటనల్లో ఎదురయిన అంశాలని దృష్టిలో ఉంచుకొని భద్రత చర్యలు తీసుకున్నారు” అని జనసేన పార్టీ ప్రకటనలో తెలిపింది.

కొండగట్టులో పూజలు:

వాహనం లోపల పవన్ కళ్యాణ్ తో పాటుగా మరో ఇద్దరు కూర్చొని చర్చించుకునే ఏర్పాటు ఉంది. అక్కడి నుంచి హైడ్రాలిక్ విధానంలో మెట్లు ఉంటాయి. వాటి ద్వారా వాహనం మీదకు చేరవచ్చు. జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. తదుపరి ఈ వాహనం పర్యటనకు వస్తుందని తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =