ప్రత్యేక ఇసుక కార్పోరేషన్, వైఎస్ఆర్ చేయూతపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

Andhra Pradesh, Andhra Pradesh News, Andhra Pradesh Political Updates, Andhra Pradesh Politics, AP Cabinet Meeting, AP Cabinet Meeting Key Decisions, Minister Perni Nani, Minister Perni Nani Press Meet, Perni Nani, Perni Nani Press Meet on AP Cabinet Meeting

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జూలై 15, బుధవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్‌ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు:

  • రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకం కింద అందించే ఆర్ధిక సహాయాన్ని అదనంగా 8.21 లక్షల మందికి అందించాలని నిర్ణయం. ఇందుకోసం నాలుగేళ్లలో రూ. 6163.59 కోట్లు కేటాయించాలని నిర్ణయం.
  • 9,712 వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి నిర్ణయం.
  • ఏపీ అగ్రికల్చరల్‌ ల్యాండ్ యాక్ట్‌ 2006 సవరణ, ప్రత్యేక ఇసుక కార్పోరేషన్ ఏర్పాటుకు ఆమోదం.
  • 44,500 పాఠశాలల్లో మూడు దశల్లో నాడు -నేడు కార్యక్రమానికి ఆమోదం.
  • రాయలసీమ కరవు నివారణకు రూ.40వేల కోట్లతో కార్పోరేషన్ ఏర్పాటు.
  • రెన్యుబుల్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్ విధానం-2020 కి ఆమోదం. 
  • సీపీఎస్‌ రద్దు పోరాటంలో టీచర్లు చేసిన ఆందోళనపై పెట్టిన కేసులు రద్దు.
  • గుంటూరులో ముస్లిం యువకులపై పెట్టిన కేసుల ఉపసంహరణకు ఆమోదం.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =