పట్టణప్రగతి, రైతు వేదికలపై జిల్లా కలెక్టర్లతో తెలంగాణ సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

Pattana Pragathi, Pattana Pragathi Programme, Pattana Pragathi Programme Guidelines, pattana pragathi telangana, Somesh Kumar, Telangana CS, Telangana CS Somesh Kumar, Telangana CS Somesh Kumar Video Conference, Telangana CS Somesh Kumar Video Conference with District Collectors

తెలంగాణ రాష్ట్రంలోని 17 జిల్లాలకు స్థానిక సంస్థల కోసం అదనపు కలెక్టర్ల నియామకంతో మొత్తం 29 జిల్లాలకు అదనపు కలెక్టర్లను నియమించినట్టు అయింది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పట్టణప్రగతి, రైతు వేదికల నిర్మాణం, మునిసిపాలిటీలలో నూతనంగా చేర్చిన గ్రామ పంచాయతీల అభివృద్ధి తదితర అంశాలపై జూలై 15, బుధవారం నాడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, మునిసిపల్ చట్టం మునిసిపాలిటీలలో నూతనంగా చేర్చిన గ్రామాలలో క్రిటికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం అవకాశం కల్పిస్తుందని చెప్పారు. జిల్లా కలెక్టర్లు ఈ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలన్నారు. మునిసిపాలిటీలలో పారిశుధ్య కార్యక్రమాలపై, డిజ్ ఇంఫెక్టన్ట్ స్ప్రేయింగ్ పై, యాంటీ లార్వల్, వెక్టర్ బర్న్ వ్యాధుల నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి కొనసాగిస్తూ మరింత విస్తృతంగా చేపట్టాలన్నారు.

అలాగే రైతు వేదికలకు సంబంధించి మిగిలిన మంజూరు పనులను వేగవంతం చేసి, జూలై 18 తేది నాటికి ఫిజికల్ గ్రౌండిoగ్ ను పూర్తి చేయాలన్నారు. రైతు వేదికల నిర్మాణ పనుల పర్యవేక్షణకు సీనియర్ అధికారులను ప్రత్యేకంగా నియమించాలన్నారు. వీటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ ప్రొక్యూర్ మెంట్ కు తగు ప్రణాళికను రూపొందించుకొని నిర్మాణ పనులలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా చూసుకోవాలన్నారు. అక్టోబర్ 10 వ తేదీ నాటికి రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. వీటితో పాటు రైతు బంధు, కల్లాల నిర్మాణం, గోడౌన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల కోసం స్థలాల ఎంపికతో పాటు ఉపాధి హామీ ద్వారా వివిధ శాఖలలో చేపడుతున్న కన్వర్జెన్స్ పనులపై సీఎస్ సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రాధాన్యతలకనుగుణంగా పనిచేయాలని కలెక్టర్లకు సీఎస్ సూచించారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =