లోకేశ్‌కు మోదీ ప్ర‌భుత్వం బాస‌ట‌!

Modi's Government Is A Basta For Lokesh!, Modi Government, Modi Government Is A Basta, AP State Elections, TDP, YSRCP, Janasena, Narendra Modi, Nara Lokesh, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
AP State Elections , TDP , YSRCP , Janasena ,Narendra Modi , Nara Lokesh

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలుగుదేశం ప్ర‌భుత్వం కేంద్రంలోని ఎన్డీఏలో చేరిన విష‌యం తెలిసిందే. దీనివ‌ల్ల ఎన్నిక‌ల ప‌రంగా ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉంటుందో.. లేదో ప‌క్క‌న పెడితే.. టీడీపీకి కేంద్రం నుంచి స‌హాయ స‌హ‌కారాలు అందుతున్న‌ట్లు స్ప‌ష్టం అవుతోంది. తెలుగుదేశం-జ‌న‌సేన‌తో బీజేపీ క‌లిసిన అనంత‌రం నిర్వ‌హించిన ఉమ్మ‌డి స‌భ‌కు న‌రేంద్ర మోదీ సైతం హాజ‌రై.. చంద్ర‌బాబును, ప‌వ‌న్ క‌ల్యాణ్ ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ఐక్య‌తారాగాన్ని ఆల‌పించారు. దీంతో పొత్తు వ‌ల్ల టీడీపీకి మోదీ స‌హ‌కారం సంపూర్ణంగా ఉంద‌న్న విష‌యం అర్థ‌మైంది. ఇప్పుడు తాజాగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు జెడ్‌ కేటగిరీ భద్రత కల్పించి కేంద్ర ప్రభుత్వం.. కూట‌మి ఐక్య‌త‌ను చాటింది.

చంద్ర‌బాబు కుటుంబానికి మావోయిస్టుల హెచ్చ‌రిక‌లు,  ప్రధాన ప్రతిపక్ష పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న నారా లోకేశ్ కు జడ్‌ కేటగిరీ భద్రత కల్పించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఎన్నోసార్లు కోరారు. దాదాపు పద్నాలుగు సార్లు రాష్ట్ర హోంశాఖ, పోలీసు బాస్‌కు లేఖలు రాశారు. ఈ విష‌యాన్ని గ‌తంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా.., ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌లేదు. తాజాగా నారా లోకేశ్‌కు జెడ్‌ కేటగిరీ భద్రత క‌ల్పిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. నిత్యం పదిమంది సాయుధులు ఆయనకు రక్షణ కల్పించేలా ఏర్పాట్లు చేసింది.  ఎన్డీఏ కూట‌మిలో టీడీపీ కూడా చేర‌డం వ‌ల్లే చంద్ర‌బాబు కుటుంబానికి మోదీ ప్ర‌భుత్వం ప్రాధాన్యం ఇచ్చింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. భ‌ద్ర‌త‌కు సంబంధించి ఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, లోకేశ్‌కు ఈ మేరకు సమాచారం అందింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తగ్గించిన సెక్యూరిటీని జాతీయ భద్రతా దళ విభాగం భర్తీ చేసింది.

2019కు ముందు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా పనిచేసిన లోకేశ్‌కు జడ్‌ కేటగిరి భద్రత అవసరమని అప్పటి సెక్యూరిటీ రివ్యూ కమిటీ కేంద్రానికి సిఫారసు చేసింది. మావోయిస్టుల ప్రభావం ఏవోబీలో ఉండటం, చంద్రబాబు కుటుంబాన్ని అంతం చేస్తామని మావోయిస్టులు పలుమార్లు హెచ్చరించడం, ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేను గత ఎన్నికలకు  ఆర్నెళ్ల ముందు మావోయిస్టులు హత్య చేయడం లాంటి ఘటనలతో లోకేశ్‌కు గత ప్రభుత్వంలో పోలీసులు భద్రత పెంచారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వ‌చ్చాక‌.. లోకేశ్‌కు భద్రత  తగ్గించింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫారసుల్ని పక్కనబెట్టి వై కేటగిరీ భద్రత కల్పించి లోకేశ్‌ బయట స్వేచ్ఛగా తిరగకుండా చేసింద‌ని టీడీపీ మొద‌టి నుంచీ ఆరోపిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో లోకేశ్‌కు భద్రత పెంచాలని  గవర్నర్‌, కేంద్ర హోంశాఖకు ఆయన సెక్యూరిటీని పర్యవేక్షించే అధికారులు లేఖలు రాశారు. యువగళం పాదయాత్రలో ఆయన్ను వైసీపీ ప్రేరేపిత అల్లరిమూకలు కవ్వించిన వీడియోలు, భౌతిక దాడులకు దిగిన దృశ్యాలతో పాటు ఇతరత్రా భద్రతా పరమైన ఆవశ్యకతను వివరిస్తూ లేఖ రాయడంతో కేంద్రం తాజాగా స్పందించింది. కేంద్రం తాజా నిర్ణ‌యంతో కేంద్ర రిజర్వ్‌ పోలీస్‌  ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌)లోని వీఐపీ వింగ్‌కు చెందిన సాయుధ కమాండోలు లోకేశ్ కు రక్షణగా నిలిచారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − twelve =