మేనిఫెస్టో లేదు..అభ్యర్థుల జాబితా కూడా లేదు

Jagan, election? manifesto, list of candidates,YCP,Pawan Kalyan, Chandrababu, TDP, Janasena, BJP, YCP, CM Jagan,AP Politics, AP Elections,Mango News Telugu,Mango News,YSRCP
Jagan, election? manifesto, list of candidates,YCP,Pawan Kalyan, Chandrababu, TDP, Janasena, BJP, YCP, CM Jagan,

వైసీపీ నేతలంతా వారం రోజులుగా సిద్ధం సభపై హడావుడి చేశారు. మార్చి 15 నుంచి ప్రచారంలోకి వెళ్లిపోతారని..ఇదే ఆఖరి సిద్ధం సభ అని చెప్పుకొచ్చారు. దీంతో అంతా ఆఖరి సిద్ధం సభలో మామూలుగా ఉండదని.. మేనిఫెస్టో, అభ్యర్థుల చివరి జాబితా ఉంటుందని భావించారు. అయితే మూడు సార్లు వాయిదా వేసి మరీ నిర్వహించిన ఆఖరి అద్దంకి సిద్ధం సభలో కూడా సీఎం జగన్ పాత రాగమే పాడటంతో ఏపీ ప్రజలు డిజప్పాయంట్ అయ్యారు.

సభ ప్రారంభం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడటం తప్ప కొత్తగా చెప్పిందేమీ లేదని ఏపీ ప్రజలు పెదవి విరుస్తున్నారు.అయితే పొత్తు పెట్టుకున్న కూటమిలో టీడీపీ, జనసేన గురించి మాట్లాడిన జగన్.. బీజేపీని గట్టిగా విమర్శించడానికి మాత్రం సాహసం చేయలేదు. ప్రారంభం నుంచి చంద్రబాబు, పవన్ అంటూ మాట్లాడిన జగన్..ముగింపులోనూ వారి నామాన్నే జపించారు. అంతే తప్ప వచ్చే ఎన్నికలలో గెలిస్తే రాష్ట్రానికి ఏం చేస్తానని చెప్పలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మేనిఫెస్టో ప్రకటిస్తారని.. మిగిలిన వైసీపీ అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటిస్తామని గతంలో చెప్పిన జగన్..ఇప్పుడు ఆ ఊసే ఎత్తలేదు. ఇప్పటికే ఇస్తున్న పథకాల లబ్ధిదారులకు సవాలక్ష కండిషన్లు పెడుతున్న జగన్..ఇప్పుడు తాజా మేనిఫెస్టోలో కొత్తగా పథకాలు పెట్టినా ఎంత వరకూ అమలు చేస్తారనే సందేహాలు ఏపీ వాసుల్లో కనిపిస్తున్నాయి. మరోవైపు మొన్నటివరకూ కేంద్రంతో దోస్తీ నడవడంతో అలా అలా నెట్టుకొచ్చిన జగన్..ఇప్పుడు ఏపీలో ప్రత్యర్ధి పార్టీగా కూటమిలో కలిసిన బీజేపీని ఎలా ఎదుర్కొంటారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

దీనికితోడు సొంతపార్టీలోని జగన్ అభ్యర్థులతో బంతాట ఆడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎవరికి టికెట్లు ఉన్నాయో తెలియదు..టికెట్ వచ్చిందని సంతోషించేలోగా మరో అభ్యర్థికి ఆ సీటును కేటాయిస్తున్నారు. ఈ భయంతోనే చాలామంది అభ్యర్థులు అసలు ప్రచారం ఊసే ఎత్తడం లేదు. ఇదే ఫైనల్ అని జగన్ నోటి వెంట వచ్చిన అభ్యర్థుల లిస్టు చూసి రంగంలోకి దిగుదామని ఆశలు పెట్టుకున్నవారికి జగన్ మరోసారి నిరాశే మిగిల్చారు.

మరోవైపు ఆదివారం జరిగిన సిద్ధం సభ ఖాళీ కుర్చీలతో దర్శనమివ్వడంతో వైసీపీ నేతలు షాక్ అయ్యారు. ఎంత ఖర్చు పెట్టినా జనాలు రావడం లేదన్న ఆందోళన కార్యకర్తలలో కనిపించింది.అందుకే సీఎం సభ అంటే వణికిపోతున్న వైసీపీ శ్రేణులు..ఇదే ఆఖరి సిద్ధం సభ అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జనాల్ని సమీకరించలేక తల ప్రాణం తోకకు వస్తుందంటూ సొంత పార్టీ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − twelve =