ఏపీలో రేపటినుంచి 7 లక్షలమంది గృహసారథులతో ‘జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం’ – సజ్జల రామకృష్ణారెడ్డి

YSRCP General Secretary Sajjala Ramakrishna Reddy Says Jagananne Ma Bhavishyathu Programme To Be Started From Tomorrow In AP,YSRCP General Secretary Sajjala Ramakrishna,Ramakrishna Reddy Says Jagananne Ma Bhavishyathu,Jagananne Ma Bhavishyathu Programme To Be Started,Jagananne Ma Bhavishyathu Programme From Tomorrow In AP,Mango News,Mango News Telugu,YSRCP To Launch Mass Outreach Programme,Sajjala Ramakrishna Reddy Press Meet,YSRCP Jagananne Ma Bhavishyathu From APril 7,YSRCP'S Outreach Programme,Jagan To Launch Mass Contact Programmes,Jagananne Ma Bhavishyathu Programme Latest News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన సాగుతున్నదని పేర్కొన్నారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే రేపటినుంచి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ‘జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం’ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాకు దీనికి సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే పదం ప్రజల నుంచి వచ్చిందని, అందుకే ఆ పేరుతో ఈ కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. ఇక ఈ కార్యక్రమం 14 రోజుల పాటు కొనసాగుతుందని, దీనికోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. సుపరిపాలన అందించడం ద్వారా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే సీఎం జగన్ లక్ష్యమని చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజకీయ పార్టీలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు.

ఇక ఈ కార్యక్రమం ద్వారా 7 లక్షలమంది గృహసారథులు దాదాపు 1కోటి 60లక్షల ఇళ్లకు వెళతారని, ఈ సందర్భంగా సీఎం జగన్ సందేశాన్ని ప్రజలకు వినిపిస్తారని తెలిపారు. అలాగే గత టీడీపీ పాలనకు, ప్రస్తుత వైసీపీ పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని, సంక్షేమ పథకాల అమలు తీరును వివరిస్తామని కూడా చెప్పారు. కాగా కరపత్రాల పంపిణీ అనంతరం ప్రజా మద్దతు పుస్తకంలోని ప్రశ్నలను అడిగి ‘పీపుల్స్ సర్వే’ నిర్వహిస్తారు. ఈ ప్రశ్నల ద్వారా ప్రజలను వారి భవిష్యత్తు కోసం సీఎం జగన్‌ను విశ్వసిస్తున్నారా అని అడిగి, సీఎం జగన్ ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలకు జగనన్నకు మద్దతు ఇస్తున్నట్లు ధృవీకరిస్తూ రసీదు ఇవ్వనున్నారు. ఆ తర్వాత ప్రజల అనుమతితో జగనన్నే మా భవిష్యత్తు స్టిక్కర్లను వారి ఇంటి తలుపుపై అతికిస్తారు. ఇక చివరగా ప్రజలు జగనన్నకు తమ మద్దతును తెలిపేందుకు 82960-82960 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరతారు అని సజ్జల వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =