పరిపాలన రాజధాని విశాఖ వైజాగ్‌లో ఏఏ శాఖలు ఎక్కడ ఉండబోతున్నాయి?

The Administrative Capital Is Visakhapatnam,The Administrative Capital,Capital Is Visakhapatnam,Mango News,Mango News Telugu,Administrative Capital Is Visakhapatnam, Located In Vizag, Vizag, Visakhapatnam, Ys Jagan, Ap Cm, Ap Politics,Administrative Capital Latest News,Administrative Capital Latest Updates,Visakhapatnam Latest News,Visakhapatnam Latest Updates

ఏపీ పరిపాలనా రాజధాని విశాఖ అని జగన్ ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే కీలక ప్రకటన చేశారు. ఆ తర్వాత కోర్టు చిక్కులు, కరోనా వల్ల బ్రేక్‌లు పడుతూ వస్తుంది. అయితే, కొద్ది నెలలుగా దసరా నుంచి విశాఖపట్నం కేంద్రంగా పాలిస్తామని చెప్పుకొస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.. తాజాగా కేబినెట్లోనూ దీనిపై ప్రకటన చేసేశారు.అంతేకాదు విశాఖకు రాజధానిని తరలించడానికి ఎప్పటి నుంచో చెబుతున్న విజయదశమినే.. ముహూర్తంగా ఫిక్స్ చేశారు. ఇప్పటికే రుషికొండ వద్ద నిర్మిస్తున్న భవనాల పనులలో మరింత వేగాన్ని పెంచి అతి త్వరలో పూర్తి చేయడానికి అధికారులు రెడీ అవుతున్నారు. అయితే అన్నీ ఒకేసారి కాకుండా..ముందుగా కీలక హెచ్‌ఓడీ కార్యాలయాలను మాత్రం విశాఖపట్నానికి తరలించనున్నారు.

వైజాజ్‌కు రాజధాని తరలింపుపై తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలనా వికేంద్రీకరణపై తామంతా స్పష్టతతో ఉన్నామని చెప్పుకొచ్చిన ఈ నేతలు.. విశాఖ నుంచే వేదికగా పాలన అనేది రాజకీయ నిర్ణయం కాదన్నారు. వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు పాలనను మరింత దగ్గర చేయాలనేదే తమ ఉద్దేశమని అన్నారు. మరోవైపు మంత్రి బొత్స సత్యనారాయణ కూడా విశాఖకు రాజధాని తరలింపుపై కొన్ని సంకేతాలు ఇచ్చారు.

అయితే పరిపాలన రాజధానిగా విశాఖ నుంచి పనులు ప్రారంభించడానికి, ముహుర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఏ శాఖలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే పనిలో అధికారులు కసరత్తులల వేగాన్ని పెంచారు. దసరా ముహుర్తంగా ఖరారు చేసి.. సీఎంఓతో పాటు ఇతర శాఖలకు అవసరమైన మౌలిక సదుపాయాలు భవనాల ఎంపిక బాధ్యతను ఇప్పటికే వసతుల కమిటీకి అప్పగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే వైజాగ్‌లో ఋషికొండపై నిర్మిస్తున్న ఆరు భవనాల గురించి ఇప్పుడు అధికారులు చర్చిస్తున్నారు. అలాగే మిగిలిన ఆఫీసులతో పాటు మంత్రులకు ఎక్కడైతే పరిపాలన సౌకర్యంగా ఉంటుందో ఆ బిల్డింగ్‌లను ముందుగా సెలక్ట్ చేసే పనిలో పడ్డారు. అందుకే ముందుగా మంత్రుల ఆఫీసుల కోసం, ఆయా శాఖాల కోసం అతిథి గృహాలను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆర్‌టీసీ కాంప్లెక్స్‌లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఫ్లోర్లతో పాటు.. గెస్ట్‌హోస్‌ను రవాణా శాఖ మంత్రికి, ఆ శాఖకు కేటాయించే అవకాశం ఉందనే వార్తలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. జిల్లా పరిషత్ గెస్ట్‌హోస్‌ను.. పంచాయతీ శాఖ మంత్రత్వ శాఖకు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బీచ్‌రోడ్డులో స్మార్‌సిటీ భవనాన్ని పురపాలక శాఖకు, ఈఎన్‌సీ ఆఫీస్.. జలవనరుల శాఖ మంత్రికి, సింహచలంలో ఆఫీస్.. దేవాదాయ శాఖ మంత్రికి కేటాయించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. అలాగే బీచ్ రోడ్ నుంచి రిషికొండ వరకు గల అపార్టెమెంట్స్‌లో 128 ప్లాట్‌లు అద్దెకు తీసుకోవడానికి ముందుగానే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఆంధ్రా మెండికల్ కాలేజీ క్వార్టర్స్ దగ్గరలో.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఓ డూప్లెక్స్ విల్లాను తీసుకునే ఆలోచనల్లో అధికారులు ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక శాఖకు కలెక్టరేట్ వెనుక ఈమధ్యనే నిర్మించిన ఐదంతస్తుల బిల్డింగ్‌ను అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. కొందరు మంత్రులు ఇప్పటికే విశాఖలో లగ్జరీ ఇళ్లను కొనేయగా, మరికొందరు మాత్రం అద్దె ఇళ్లను వెతుక్కునే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఏది ఏమయినా దసరా నుంచి విశాఖ అధికార పార్టీ నేతలతో బిజీగా మారనుందనే విషయం మాత్రం ఇప్పుడు అందరికీ క్లియర్‌గా అర్ధం అవుతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =