మీ ఫేవరేట్ బిస్కట్లు..క్రీమ్‌ బిస్కెట్లా?

If You Are A Cream Biscuits Lover Then You Must Know This,If You Are A Cream Biscuits Lover,Cream Biscuits Lover Then You Must Know This,Mango News,Mango News Telugu,Cream Biscuits Lover, Cream Biscuits,Triglycerides, Cholesterol Problems,Cream Biscuits, Salt Biscuits, Bakery Biscuits, Cream Crackers, Mary Biscuits, Osmania Biscuits,Cream Biscuits Lover Latest News,Cream Biscuits Lover Latest Updates,Cream Biscuits Lover Live News

చాలా మందికి వయసుతో సంబంధం లేకుండా బిస్కెట్లను ఇష్టంగా తింటుంటారు. క్రీమ్ బిస్కెట్లు, సాల్ట్ బిస్కెట్లు, బేకరీ బిస్కెట్లు, క్రీమ్ క్రాకర్లు, మేరీ బిస్కెట్లు , ఉస్మానియా బిస్కెట్లు ఇలా ఆకలి అనిపించో, తినాలనిపించో చాలాసార్లు బిస్కట్లను లాగించేస్తుంటారు.సాధారణంగానే బిస్కెట్లు చాలామందికి ఆల్ టైమ్ ఫేవరేట్ స్నాక్స్‌‌గా బిస్కెట్స్ ఉంటాయి. జర్నీలలో కూడా చివరకు ఓ బిస్కెట్‌ ప్యాకెట్‌, ఓ నీళ్ల బాటిల్‌ తీసుకెళ్లి కడుపు నింపేసుకున్న రోజులు కూడా చాలామందికి ఉంటాయి.

పోనీ రెండో, మూడో బిస్కట్లు తిని ఊరుకుంటే పర్వాలేదు కానీ.. చాలా మంది ఒకేసారి ప్యాకెట్‌ మొత్తం ఖాళీ చేసేస్తుంటారు. కానీ ఇది అస్సలు మంచిది కాదంటున్నారు డాక్టర్లు. ఇలా తినడం వల్ల మన శరీరానికి మనమే చాలా చెడు చేసుకున్నవాళ్లం అవుతామట.బిస్కట్లు ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలతో పాటు..మలబద్ధకం సమస్య తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు.

నార్మల్ బిస్కట్లు కంటే ఎక్కువగా క్రీమ్ బిస్కెట్లలో మరింతగా కేలరీలు ఉంటాయి. ఇందులో కేలరీలకు తోడు ఫ్యాట్‌ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఒకేసారి.. ఎక్కువ క్రీమ్ బిస్కెట్లు తినేస్తుంటే.. చాలా వేగంగా బరువు పెరుగుతారట.

ఇలా అకస్మాత్తుగా బరువు పెరగడం వల్ల ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ సమస్యలు ఎక్కువగా వస్తాయి. అందువల్లే ఆకలిగా అనిపించినప్పుడల్లా బిస్కెట్లు తెగ లాగించేయకూడదు. అందులోనూ క్రీమ్ బిస్కెట్లు అసలే తినకూడదు. ఇది గుండె సమస్యల ప్రమాదాన్నికూడా పెంచుతుంది.

నిజానికి బిస్కెట్ల మధ్య ఉండే క్రీమ్.. బిస్కెట్ల రుచిని మరింతగా పెంచి రుచి గ్రంధులను ఎక్కువ తినేలా ప్రేరేపిస్తాయి. ఈ బిస్కెట్‌లోని తీపి వల్ల ఈ రకమైన బిస్కెట్ కడుపులోకి చేరిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిని అమాంతం పెంచుతుంది. అందులోనూ షుగర్ ఉన్నవారు క్రీమ్ బిస్కెట్లు అసలే తినకూడదు.

క్రీమ్ బిస్కెట్లలో బ్యూటిలేటెడ్ హైడ్రాక్సీయానిసోల్‌, బ్యూటిలేటెడ్ హైడ్రాక్సీటోల్యూన్ అనే రెండు హాని చేసే పదార్థాలు ఉంటాయి. ఈ రెండింటి వల్లే శరీరానికి చాలా హాని కలుగుతుంది. దీనికి తోడు బిస్కెట్లను మైదా పిండితోనే తయారు చేస్తారు. అయితే కొన్నిబిస్కట్లుకంపెనీలు ఓట్స్‌తో కూడా బిస్కెట్లను తయారుచేస్తాయి. వీటిలో క్రీమ్ ఉండదు. అలాగే మైదాతో తయారు చేసే క్రీమ్ బిస్కెట్లలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల కూడా మలబద్ధక సమస్య కూడా వస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =