ఇవే తమకు చివరి ఎన్నికలంటూ ప్రకటన

Vallabhaneni Vamsi Declare That This Is Their Last Election, Vallabhaneni Vamsi Declare Last Election, Last Election for Vallabhaneni Vamsi, This Is Their Last Election, Vallabhaneni Vamsi Last Election, Vallabhaneni Vamsi, Election, Kodali Nani,YCP, TDP, Jana Sena, AP Assembly Elections, Lok Sabha Elections, Andhra Pradesh Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Vallabhaneni Vamsi, election,Kodali Nani,YCP, TDP, Jana Sena, AP Assembly Elections,

గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ కూడా కొడాలి నానిలాగే ఆఖరి రాగం పాడేశారు. తాజాగా ఇవే తనకు చివరి ఎన్నికలని చెప్పిన వంశీ .. గన్నవరం ఎన్నికల గురించి చెప్పారా లేక ఏకంగా రాజకీయాల నుంచే పోటీ చేయనని చెప్పారా అన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ మారిన రాజకీయ పరిణామాలతో వల్లభనేని రాజకీయాల నుంచి తప్పుకోవడం తప్ప వేరే మార్గం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున గన్నవరం నుంచి దుట్టా రామచంద్రరావు కుమార్తె పోటీ చేస్తారని తాను ఆమెకు మద్దతిస్తానని వల్లభనేని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు దుట్టా రామచంద్రరావు కానీ ఆయన వర్గీయులు కానీ వంశీకి సపోర్ట్ చేయకపోవడం వల్లే వంశీ ఆ మాటలు అన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో దుట్టా రామచంద్రరావు కుమార్తెకు మద్దతిస్తానని చెప్పడం దుట్టా వర్గీయులను దగ్గరకు తీసుకోవడానికే అని చెబుతున్నారు.

నిజానికి వైఎస్సార్సీపీలో వల్లభనేని వంశీ అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉన్నారు. ఆయనతో పాటు టీడీపీ నుంచి వచ్చిన వారు 90 శాతం వరకూ తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. ఓ పది శాతం మంది అనుచరులు మాత్రమే వంశీతో పాటు ఉన్నారు. వైఎస్సార్సీపీలో ఉన్న యార్లగడ్డ తన అనుచరుల్ని తీసుకుని వెళ్లిపోయారు. దుట్టా రామచంద్రరావు వర్గం అయితే వంశీపై తీవ్రమైన కోపంతో ఉన్నారు. మరోవైపు టీడీపీలో ఉన్నప్పుడు తమపై కేసులు పెట్టించి.. ఇప్పుడు వైఎస్సార్సీపీ వచ్చి ఇక్కడ కూడా తమ అవకాశాల్ని కాజేశారని వైసీపీ కేడర్ అసహనం వ్యక్తం చేస్తూ ఆయనకు దూరంగా ఉంటోంది.

ఐదేళ్లలో వంశీ గన్నవరం నియోజకవర్గానికి చేసిందేమీ లేకపోవడంతో స్థానికంగానూ ఆయనకు మద్దతు లేదు. ఈ విషయం వంశీ నామినేషన్ ర్యాలీకి.. జనం రాకపోవడంతోనే అందరికీ అర్ధం అయింది. 2019లో టీడీపీ తరపున ఆయన నామినేషన్ వేస్తే నాలుగైదు కిలోమీటర్ల మేర రోడ్లన్నీ పసుపు మయం అయ్యాయి. కానీ ఇప్పుడు వంశీ సీన్ ఏంటో ఆయనకే బాగా అర్ధం అయింది. మొన్నటివరకూ దుట్టా రామచంద్రరావును పట్టించుకోలేదు. ఆయన కుమార్తెను జడ్పీటీసీని చేశానని కబుర్లు చెప్పారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తాను తప్పుకుని ఆయన కుమార్తెకు అవకాశం ఇస్తాను అన్నట్లు చెబుతుండంతో వంశీపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. మొన్న కొడాలి నానికి కళ్లు తెరుచుకుంటే..ఇప్పుడు వల్లభనేని వంశీకి అసలు సీన్ అర్ధం అయిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 1 =