త్వరలో వైసీపీ మేనిఫెస్టో విడుదల

CM Jagan, AP Politics, AP Elections, YCP Menifesto, YSRCP manifesto, YSRCP, Andhra Pradesh, Assembly Elections News, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, Rythu Bharosa scheme, TDP, Mango News Telugu, Mango News
CM Jagan, AP Politics, AP Elections, YCP Menifesto

ఎన్నికలొస్తే చాలు ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ విశ్వప్రయత్నాలు చేస్తుంటాయి. జనాలను తమవైపు తిప్పుకునేందుకు తాయిలాలు ప్రకటిస్తుంటాయి. అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తామంటూ హామీల మీద హామీలు గుప్పిస్తుంటాయి. కొన్నికొన్నిసార్లు ఆ హామీలే ఎన్నికల్లో పార్టీల భవితవ్యాన్ని డిసైడ్ చేస్తుంటాయి. పార్టీల గెలుపోటలములపై హామీలు, మేనిఫెస్టోలు తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. అందుకే పార్టీలు మేనిఫెస్టోను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా హామీలు గుప్పిస్తుంటాయి.

త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనుండడంతో ప్రధాన పార్టీలన్నీ మేనిఫెస్టోలపై దృష్టి పెట్టాయి. ఏపీలో దూకుడుగా వెళ్తోన్న అధికార వైసీపీ.. మేనిఫెస్టోను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. గత ఎన్నికల్లో నవరత్నాలు పేరుతో వైసీపీ అధినేత జనగ్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను ప్రకటించారు. నవరత్నాలే వైసీపీని విజయతీరాలకు చేర్చాయి. ఆ పథకాలు జనాలను ఆకట్టుకోవడంతో.. వైసీసీకే పట్టం కట్టారు. హామీలను అమలు చేసేందుకు వందకు వంద శాతం కృషి చేశామని.. నవరత్నాలను అమలు చేశామని జగన్ చెబుతున్నారు.

ఇప్పుడు ఎన్నికల ముంగిట మరోసారి జనాలను ఆకట్టుకునేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు. నవరత్నాలకు మించిన హామీలతో త్వరలో మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేనిఫెస్టోపై జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారట. రైతులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, నిరుద్యోగులు, యువత, విద్యార్థులు ఇలా అన్ని రంగాల వారిని ఆకట్టుకునేలా మేనిఫెస్టోను రూపొందించారట. ప్రస్తుతం సిద్ధం పేరుతో జగన్ రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 18న అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం ముగింపు సభను భారీ ఎత్తులో నిర్వహించేందుకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సభలోనే జగన్ మేనిఫెస్టోను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే సామాజిక పెన్షన్ రూ. 3 వేలకు పెంచుతామని జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కొద్దిరోజులక్రితమే పెన్షన్‌ను రూ. 3 వేలకు పెంచారు. ఇప్పుడు మరోసారి అధికారంలోకి వస్తే పెన్షన్‌ను రూ. 4 వేలకు పెంచుతామని హామీ ఇవ్వబోతున్నారట. ఏపీలో పెన్షన్ పొందేవారి సంఖ్య లక్షల్లో ఉంది. ఈ హామీ ద్వారా వారంతా తమకు వైపు మళ్లుతారని జగన్ భావిస్తున్నారట.

ఏపీలో 65 నుంచి 70 లక్షల మంది రైతులు ఉన్నారు. వారందరినీ ఆకట్టుకునేలా రైతులకు జగన్ కీలక హామీ ఇవ్వబోతున్నారట. రైతు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించబోతున్నారట. ఈ హామీ ప్రజల్లో వెళ్తుందని.. ఎన్నికలవేళ బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుందని వైసీపీ పెద్దలు అనుకుంటున్నారట. అలాగే మహిళా సంక్షేమానికి మరింత కృషి చేస్తామని.. డ్వాక్రా మహిళల కోసం కొత్త పథకాలు తీసుకొస్తామని హామీ గుప్పివ్వబోతున్నారట. యువత, నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక హామీలను సిద్ధం చేశారట. మరి వైసీపీ మేనిఫెస్టో జనాల్లోకి ఎంతు వరకు వెళ్తుంది.. ప్రజలు రెండోసారి వైసీపీకి పట్టం కడుతారా? అన్నది చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − 2 =