ఆ స‌మ‌స్య వైసీపీకి అగ్ని ప‌రీక్ష‌గా మార‌నుందా?

YCP, CM Jagan, YCP Candidates, AP elections, Legislative Assembly, JSP, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, pawan kalyan, lok sabha elections, MLA, Mango News Telugu, Mango News
YCP, CM Jagan, YCP Candidates, AP elections

దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. గంప గుత్తగా పెద్ద సంఖ్యలో సిట్టింగ్‌లను సైడ్ చేసేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీ కూడా ఇప్పటి వరకు ఈ రీతిలో సిట్టింగ్‌లను మార్చలేదు. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ ఎదుర్కొన్న పరిస్థితులు.. బీఆర్ఎస్ ఓటమికి కారణాలను క్షుణ్ణంగా పరిశీలించిన జగన్.. యాభైకి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. పదికి పైగా సిట్టింగ్ ఎంపీలను పక్కకు పెట్టేశారు. మరికొంత మందిని కూడా సిట్టింగ్ స్థానం నుంచి తొలగించేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు.

కొందరు సిట్టింగ్ ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి.. మరికొందరు ఎమ్మెల్యేలను లోక్ సభ ఎన్నికల బరిలోకి జగన్ షఫిల్ చేస్తున్నారు. అదే సమయంలో మరి కొందరు నేతలను పూర్తిగా సైడ్ చేసేస్తున్నారు. ఈక్రమంలో వైసీపీలో అసంతృప్తి భగ్గుమంటోంది. పెద్ద ఎత్తున నేతలు టికెట్ దక్కలేదని.. ముందు ముందు కూడా టికెట్ వచ్చే అవకాశాలు లేక అసంతృప్తితో రగిలిపోతున్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీని వీడగా.. మరికొందరు కూడా పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నారు.

అయితే ఇతర పార్టీల్లోకి పోయిన వారిని.. పోయే వారిని పక్కకు పెడితే.. అసలు కొత్తగా ఇంఛార్జిగా నియమించిన వారి పనితీరు ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో వారు ఎంత వరకు పుంజుకుంటారనేది ప్రశ్నగా మిగిలిపోయింది. అటు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరో మూడు నెలల సమయం కూడా లేదని ఎన్నికల సంఘం నుంచి బలమైన సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ తక్కువ సమయంలో కొత్త అభ్యర్థులు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే వైసీపీకి అసలైన అగ్నిపరీక్ష అని విశ్లేషకులు అంటున్నారు.

మొన్నటి వరకు ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన నేతలను, కేడర్‌ను కొత్త అభ్యర్థులు తమవైపు తిప్పుకోవాల్సి ఉంటుంది. వారిని తమ గెలుపుకోసం పనిచేసేలా.. వారిని అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే నియోజకవర్గంలో వారి ప్రభావం కాస్త తగ్గించి.. తాము పుంజుకునేలా పనిచేయాల్సి ఉంటుంది. ఇదే సమయంలో టికెట్ దక్కని వారి నుంచి ఎదురయ్యే అసమ్మతిని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ అతి తక్కువ సమయంలో ఇదంతా వారితో సాధ్యమవుతుందా? లేదా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 8 =