ఎన్నికలలో పోటీకి వైసీపీ నేతల వెనుకడుగు

YCP leaders step back from competition, YCP leaders,MP Seats, MLA Seats, BJP,TDP, Janasena, CM Jagan, Pawan Kalyan, ysrcp, Andhra Pradesh News Updates, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News
YCP leaders step back from competition, YCP leaders,MP Seats, MLA Seats, BJP,TDP, Janasena

ఏపీలో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. రాబోయే ఎన్నికలలో ఎలా అయినా గెలిచి ఐదేళ్ల పాటు చక్రం తిప్పాలని అన్ని పార్టీల నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ రాకపోతే స్వతంత్ర అభ్యర్ధిగా అయినా.. పార్టీ మారి అయినా ప్రజా ప్రతినిధిగా మారాలని కలలు పట్టుదలతో ఉన్నారు.  కానీ దీనికి భిన్నంగా..వైసీపీ కొత్త ఇంచార్జులు… పాత ఎమ్మెల్యేలు తాము ఈ ఎన్నికలలో పోటీ చేయలేమని చేతులెత్తేస్తున్న సీన్లు కనిపించడంతో ఏపీ సీఎం జగన్ షాక్ అవుతున్నారట. ఇప్పటికే కొంతమంది ఈ దిశగా సంకేతాలు ఇచ్చేయగా..మరికొంతమంది తమ పేర్లు అధినేత ప్రకటించినా కూడా ప్రచారం కూడా ప్రారంభించకపోవడం హాట్ టాపిక్ అవుతోంది.

విషయం తెలుసుకున్న ఏపీ సీఎం జగన్.. కొంత మంది అభ్యర్థులను మార్చేసారట. అయితే రానున్న రోజుల్లో ఇంకా చాలా మంది పోటీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. అవనిగడ్డ, నెల్లూరు ఎంపీ, చిలుకలూరిపేట వంటి చోట్ల వైసీపీ అభ్యర్థులు ప్రచారం పేరే ఎత్తడం లేదు. అంతేకాకుండా చాలా చోట్ల సమన్వయకర్తలుగా నియమితులైన వాళ్లు కూడా చివరి క్షణంలో జగన్ హ్యాండిస్తారన్న వార్తలు వినిపించడంతో..అనవసర ఖర్చు ఎందుకు చేయడమని సైలెంట్ అయిపోతున్నారట.

నిజానికి ప్రారంభం నుంచీ కూడా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల కష్టాలు అన్నీఇన్నీ కావన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ జగన్ ఆరు జాబితాలను విడుదల చేశారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు ఫిబ్రవరి నెలాఖరులోగా పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేసే పనిలో ఉన్నారు. అన్ని పార్టీల కంటే ముందుగా మొదటి జాబితా జనవరిలోనే ప్రకటించిన జగన్… తరువాత 2,3,4,5,6 జాబితాలను కూడా విడుదల చేశారు. మొత్తం 82 స్థానాలకు తమ అభ్యర్థులను ఖరారు చేశారు. మరో రెండు రోజుల లోపే  ఏడో జాబితా కూడా రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అభ్యర్థిత్వాలు ఖరారైన వారంతా.. ఫ్లెక్సీలు వేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ.. ప్రచారం చేస్తూ జనంలోకి మాత్రం వెళ్లడంలేదు.

అయితే ఏ అభ్యర్థి ఎలాప్రచారం చేస్తున్నారో.. ఎంతమంది ప్రచారానికి వెళుతున్నారో వైసీపీ అధిష్టానం ఆరాలు తీస్తోంది. దీనిలో చాలామంది నామమాత్రంగానే తమ ఆసక్తిని చూపిస్తున్నట్లు తేలిందట. దీనికి కారణాలు వైసీపీ నేతలను అధిష్టానం తెగ వాడేసుకుంటుందని.. చివరకు యాత్ర సినిమా టికెట్లు కూడా కొని ప్రజలకు పంచాలని ఆదేశించిందన్న విషయాలేనంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎలాగూ గెలవని పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు దండగ అన్న ఫీలింగ్ లోనే అభ్యర్థులు ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. . ప్రచారం పక్కన పెడితే సొంత డబ్బులయినా మిగులుతాయి కదా అని లెక్కలు వేసుకుంటున్నారన్న టాక్ నడుస్తోంది. ఇదంతా చూస్తున్న రాజకీయ విశ్లేషకులు ఇలాంటి సిచ్యువేషన్‌ను తాము ఇప్పటి వరకూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =