ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు ఖరారు

Seats that Chandrababu will give to BJP, MP, MLA Seats, BJP,TDP, Janasena, srikakulam, Chandrababu, narendra modi, home minister Amit Shah, Indian Prime Minister Narendra Modi,Indian PM Narendra Modi,Narendra Modi, Mango News Telugu, Mango News
Seats that Chandrababu will give to BJP, MP and MLA Seats, BJP,TDP, Janasena

ఏపీలో 2014 ఎన్నికల పొత్తుల సీన్  రిపీట్ అవ్వబోతోంది. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా.. టీడీపీ,జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. ఈ సారి ఎన్నికల్లో 400 సీట్లు గెలవటమే టార్గెట్‌గా పెట్టుకున్న బీజేపీ పాత మిత్రులతో..మరోసారి కొత్త పొత్తులకు సిద్దం అవుతోంది.  ఈ సారి బీజేపీ ఏపీలో టీడీపీ, జనసేన సహకారంతో సీట్లు గెలవాలని అనుకుంటోంది. దీని కోసం పెద్ద సంఖ్యలో సీట్లు కోరగా.. చంద్రబాబు బీజేపీకి కేటాయించే ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల పైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో వైసీపీని గద్దె దించడానికి చంద్రబాబు ఏ ఒక్క అవకాశాన్నీ కూడా వదులుకోవటం లేదు. దీని కోసం సొంత పార్టీ అభ్యర్దులను కూడా త్యాగాలకు సిద్దం కావాలని కోరుతున్నారు. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు సుమారు 50 సీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. జనసేన, టీడీపీ మధ్య ఇప్పటికే సీట్ల సర్దుబాటు పైన రెండు పార్టీల నేతలు ఒక అంచనాకు వచ్చారు. బీజేపీతో పొత్తు వల్ల ఇప్పుడు ఆ సీట్లలో మార్పులు చేయాల్సి వచ్చింది. జనసేన ముందుగా 40 సీట్లు కోరినా కూడా..బీజేపీ కలయికతో ఆ సంఖ్య 25కు పరిమితమయింది. బీజేపీ 25 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలు కోరగా.. చంద్రబాబు  ఆరు ఎంపీ స్థానాలు, 15 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

బీజేపీ కోరిన స్థానాలపైన గట్టిగా కసరత్తు చేసిన చంద్రబాబు.. బీజేపీకి కేటాయించే స్థానాల పైన క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా అరకు, విశాఖపట్నం, ఏలూరు లేదా రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, రాజం పేట ఎంపీ స్థానాలను బీజేపీకి ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించినట్లు తెలుస్తోంది. విశాఖ సెగ్మెంట్  నుంచి జీవీఎల్ నరసింహారావు, రాజమండ్రి నియోజకవర్గం నుంచి పురందేశ్వరి, విజయవాడ స్థానం నుంచి సుజనా చౌదరి, రాజంపేట నియోజకవర్గం  నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉండబోతున్నారు.

అదే విధంగా.. బీజేపీకి 15 ఎమ్మెల్యే స్థానాలపైన కూడా టీడీపీ అధినేత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అరకు, విశాఖ ఉత్తరం, శ్రీకాకుళం, కాకినాడ సిటీ, రాజమండ్రి సిటీ, జమ్మలమడుగు, ధర్మవరం, గుంతకల్, ఉంగుటూరు/ తాడేపల్లిగూడెం, కైకలూరు, విజయవాడ సెంట్రల్, శ్రీకాళహస్తి, మదనపల్లె,  ఒంగోలు, ప్రత్తిపాడు నియోజకవర్గాలు బీజేపీకి కేటాయించడానికి చంద్రబాబు సిద్ధం అవుతున్నారట.

మరోవైపు బీజేపీకి కేటాయించే ఈ ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో చాలా సీట్లు టీడీపీ ఈ సారి గెలిచే అవకాశం ఉందన్న నమ్మకంతో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. రాజమండ్రి నుంచి సోము వీర్రాజు, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్, ధర్మవరం నుంచి వరదాపురం సూర్యనారాయణ పేర్లు ఇప్పటికే ఖాయమైనట్లు వార్తలు వినిపించాయి.

ఒంగోలు, విజయవాడ సెంట్రల్ సిగ్మెంట్లలో టీడీపీ-జనసేన అభ్యర్ధులు దాదాపు ఖరారవగా..ఇప్పుడు ఈ2  స్థానాలు బీజేపీకి కేటాయించాలని అనుకుంటున్నారు.  పొత్తుల్లో భాగంగా బీజేపీ – జనసేనకు 9 ఎంపీ స్థానాలు, 40 అసెంబ్లీ స్థానాలను టీడీపీ వదులుకోవడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. దీంతో..బీజేపీకి కేటాయిస్తున్న సీట్ల  టీడీపీ – జనసేనలో ఆశావాహులలో అసంతృప్తులు పెరిగే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 12 =