యాషెస్ లో ఇంగ్లాండ్ పై మొదటి టెస్టు గెలిచిన ఆస్ట్రేలియా

Ashes Australia vs England 1st Test Day 4 Updates,Australia vs England Test,Australia vs England Test 2021,Mango News,Mango News Telugu,Ashes 2021, Australia vs England 1st Test Day 4 Highlights,Australia nine-wicket win over England,Aussies win first Test,Aussies win 1st Test,Australia vs England first Ashes Test 2021-22,Australia Thrash England By 9 Wickets,Australia vs England 1st Test,Nathan Lyon 400-Test-wicket club,Aussies win first Test

యాషెస్ సిరీస్ ను ఆస్ట్రేలియా విజయంతో ఆరంభించింది. గబ్బా వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఇంగ్లాండ్ జట్టుపై ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 220/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో 77 పరుగులు చేసి మిగిలిన 8 వికెట్లనూ కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ నిర్దేశించిన 20 పరుగుల స్వల్ప స్కోరును 5.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి ఆస్ట్రేలియా ఛేదించింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది.

అంతకుముందు ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్ లో బ్యాట్స్ మన్ దారుణ వైఫల్యంతో 147 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఐదు వికెట్ల ఫీట్ సాధించి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ 425 పరుగులు సాధించి ఇంగ్లాండ్ ముందు భారీ ఆధిక్యం ఉంచింది. ఈసారి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ని జాగ్రత్తగా ప్రారంభించి 3వ రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 220 పరుగులతో ఆసీస్ కు ధీటుగా సంధానమిస్తున్నట్లుగా కనిపించింది. కానీ, 4వ రోజు ఆటలో మాత్రం ఆ దూకుడు కొనసాగించలేకపోయింది. 297 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. ఆపై స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా అలవోకగా ఛేదించింది.

400 వికెట్ల క్లబ్ లో లియాన్: ఆసీస్ బౌలర్ నాథన్ లియాన్ 4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనంలో కీలకంగా నిలిచాడు. అంతేకాకుండా రెండో ఇన్నింగ్స్ లో తీసిన వికెట్లతో నాథన్ లియాన్ 400 వికెట్ల క్లబ్ లోకి అడుగుపెట్టాడు. 400 వికెట్లు సాధించిన ఆసీస్ 3వ బౌలర్ గా నిలిచాడు. మాజీ ఆటగాళ్లు షేన్ వార్న్ (708), గ్లెన్ మెక్ గ్రాత్ (563) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. కాగా, ఒక్క వికెట్ కోసం లియాన్ 10 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. ఈ ఏడాది జనవరిలో టీమిండియా తో జరిగిన మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ వికెట్ తీయడం ద్వారా 399 వికెట్లను చేరుకున్న లియాన్ ఒక్క వికెట్ కోసం డిసెంబర్ వరకు ఆగాల్సి వచ్చింది. చివరకు ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ డేవిడ్ మలన్ వికెట్ తీయడా ద్వారా 400 వికెట్ల క్లబ్ లోకి అడుగు పెట్టాడు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =