కరోనా వ్యాప్తి నేపథ్యంలో 55 గంటల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్

55 Hour Lockdown in Uttar Pradesh, Lockdown in Uttar Pradesh, national news, Uttar Pradesh, Uttar Pradesh 55 Hour Lockdown, Uttar Pradesh Coronavirus, Uttar Pradesh Coronavirus Cases, Uttar Pradesh Coronavirus News, Uttar Pradesh Lockdown, Uttar Pradesh Lockdown Updates

రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 55 పాటు గంటల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు యూపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. రాష్ట్రంలో దాదాపు మూడు రోజుల పాటు కఠిన లాక్‌డౌన్ నిబంధనలు అమలు కానున్నాయి. జూలై 10, శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి జూలై 13, సోమవారం ఉదయం 5 గంటల వరకు ఈ లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది.

ఈ సందర్భంగా అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలు, వస్తువుల దుకాణాలు, మాల్స్ మరియు రెస్టారెంట్లు మూసివేయనున్నారు. అలాగే రాష్ట్రంలో బస్సులు మరియు ఇతర ప్రజా రవాణాకు అనుమతి లేదు. అయితే రాష్ట్రానికి వచ్చే రైళ్లు, విమాన‌యాన స‌ర్వీసులు మాత్రం య‌ధావిధిగా కొన‌సాగుతాయ‌ని చెప్పారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 32,362 కి చేరుకుంది. వీరిలో కరోనా నుంచి 21,127 మంది కోలుకోగా, 862 మంది మరణించారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =