పంజాబ్ సీఎం ప్రధాన సలహాదారుగా ప్రశాంత్‌ కిషోర్ నియామకం, 2022 ఎన్నికలే లక్ష్యం?

Amarinder Singh Appoints Prashant Kishor as Principal Advisor, Appoints Prashant Kishor as Principal Advisor For Punjab CM, Mango News, Prashant Kishor, Prashant Kishor Appointed as Political Analyst of Punjab Chief, Prashant Kishor appointed political adviser to Punjab CM, Prashant kishor Latest News, Punjab Assembly Election 2022, Punjab CM, Punjab CM Appoints Prashant Kishor as Principal Advisor, Punjab CM Captain Amarinder Singh, Punjab Govt Appoints Prashant Kishor As Principal Advisor

పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌ సింగ్‌ సోమవారం నాడు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ను తన ప్రధాన సలహాదారుగా నియమించారు. ఈ మేరకు సీఎం అమరీందర్‌ సింగ్ ట్వీట్ చేశారు. “ప్రశాంత్ కిషోర్ నా ప్రిన్సిపాల్ అడ్వైజర్‌గా చేరారని తెలియజేయడం సంతోషంగా ఉంది. పంజాబ్ ప్రజల శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాం” అని సీఎం అమరీందర్‌ సింగ్ పేర్కొన్నారు. అనంతరం పంజాబ్ సీఎంఓ కార్యాలయం ప్రశాంత్ కిషోర్‌ కు కేబినెట్‌ హోదా ర్యాంకు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అతనికి రూ.1 గౌరవ వేతనం అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

2022 లో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రశాంత్‌ కిషోర్ ను తన ప్రధాన సలహాదారుగా సీఎం అమరీందర్‌ సింగ్ నియమించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు పంజాబ్ లో 2017 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సీఎం అమరీందర్‌ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ కాంగ్రెస్ కు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి, పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. కాగా ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఏంసీ పార్టీ గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =