ఆసియా కప్ 2022: అఫ్గనిస్థాన్‌పై భారత్‌ ఘన విజయం, మూడేళ్ళ తర్వాత సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ

Asia Cup 2022 India Beats Afghanistan Virat Kohli Hits Century After Three Long Years, India Beats Afghanistan, Asia Cup 2022, Virat Kohli Hits Century, Virat Kohli 100 After 3 Years, Mango News, Mango News Telugu, India vs Afghanistan Asia Cup 2022, Virat Kohli 71st Century, Asia Cup 2022 Super 4, Virat Kohli 71St International Hundred, India vs Afghanistan Highlights, IND vs AFG, IND vs AFG Asia Cup Highlights, Asia Cup 2022 Latest News And Updates

ఆసియా కప్‌లో ఫైనల్‌కు వెళ్లే దారులు మూసుకుపోయిన వేళ జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో భారత్ పసికూన అఫ్గనిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. టోర్నమెంటులో అంతగా ప్రాముఖ్యత లేని ఈ మ్యాచ్‌  మాఅభిమానులకుత్రం అమితాసక్తిని కలుగజేసింది. దానికి కారణం ఒకే ఒక్క విషయం.. టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం. అవును దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లీ సెంచరీ సాధించడం విశేషం. చాలా కాలంగా సరైన ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న కోహ్లీ ఎట్టకేలకు సెంచరీతో సత్తా చాటాడు.

టాస్‌ గెలిచిన అఫ్గన్‌ కెప్టెన్‌ మహమ్మద్‌ నబీ, భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మకి విశ్రాంతి ఇవ్వడంతో జట్టు పగ్గాలు చేపట్టిన లోకేష్ రాహుల్, ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ చెలరేగి ఆడటంతో భారత్‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసింది.ఈ క్రమంలో తొలి వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హాఫ్ సెంచరీ తర్వాత రాహుల్ (62 పరుగులు) అవుటయ్యాడు. సూర్యకుమార్‌, రిషభ్ పంత్ తో కలిసి కోహ్లీ 61 బంతుల్లో 12ఫోర్లు, 6సిక్స్‌లతో 122 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్ అఫ్గనిస్థాన్‌ ముందు భారీ టార్గెట్ ఉంచింది.

అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన అఫ్గనిస్థాన్‌, టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్వింగ్‌ ధాటికి 111/8 స్కోరుకు పరిమితమై పరాజయం పాలైంది. భువనేశ్వర్‌ కుమార్‌ (4-1-4-5) తన కెరీర్ లోనే అత్యద్భుతమైన గణాంకాలు నమోదు చేసాడు. భువీ స్వింగ్ బౌలింగ్ కు అఫ్గనిస్థాన్‌ జట్టు బాటర్ల వద్ద సమాధానమే లేకపోయింది. ఆ జట్టులో ఇబ్రహీం జద్రాన్‌ (64 నాటౌట్‌) మినహా మిగిలిన అందరూ దారుణంగా విఫలమయ్యారు.

ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ సాధించిన పలు రికార్డులు..

  • విరాట్‌ కోహ్లీకి టీ20ల్లో ఇది తొలి సెంచరీ.
  • అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు (122* పరుగులు) చేసిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
  • రోహిత్‌శర్మ (118 పరుగులు), సూర్యకుమార్‌ యాదవ్‌ (117 పరుగులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
  • అఫ్ఘాన్‌ జట్టుపై టీ20ల్లో ఏ ఆటగాడికైనా ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు.
  • అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ సెంచరీలు (71) చేసిన రెండో బ్యాటర్‌గా పాంటింగ్‌ సరసన లిచిన కోహ్లీ. వీరికంటే సచిన్‌ టెండూల్కర్ (100) ముందున్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 10 =