బాలాపూర్ గణేష్ లడ్డూకు రికార్డు ధర, వేలంపాటలో రూ.24.60 లక్షలు పలికిన లడ్డూ

Hyderabad Balapur Ganesh Laddu Fetches Rs 24.60 Lakh in Auction, Balapur Laddu Fetches Rs 24.60 Lakh, Balapur Ganesh Laddu Auctioned For 24.60 Lakh, Hyderabad Balapur Ganesh Laddu, Hyderabad Famous Ganesh Laddu, Mango News, Mango News Telugu, Balapur Laddu Crossed Rs 20 Lakh, Balapur Ganesh Laddu , Khairatabad Ganesh Laddu, Ganesh Laddu News And Latest Updates, Balapur Laddu Latest News And Live Updates, Balapur Laddu

హైదరాబాద్ నగరంలో శుక్రవారం ఉదయం నుంచే గణేష్ నిమజ్జనాల శోభాయాత్ర కొనసాగుతుంది. నిమజ్జనాల సందడితో రహదారులన్నీ జనంతో నిండిపోతున్నాయి. ఇక ప్రతి సంవత్సరం అందరిలోనూ ఆసక్తి కలిగించే బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట ఈసారి కూడా అంతే ఆకర్షణీయంగా నిలిచింది. బాలాపూర్ లడ్డూ వేలం పాట శుక్రవారం ఉదయం జరిగింది. వేలంపాటలో పలువురు భక్తులు పాల్గొనగా, మరోసారి లడ్డూకు రికార్డ్ స్థాయి ధర పలికింది. పోటాపోటీగా జరిగిన వేలంపాటలో బాలాపూర్ లడ్డూను రూ.24.60 లక్షలకు బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. బాలాపూర్‌ లో జరిగిన వేలంపాట కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఇతర నాయకులు హాజరయ్యారు.

1994 నుంచి బాలాపూర్ లో లడ్డును వేలం పాట కొనసాగిస్తున్నారు. మొదటిగా లడ్డూ ధర రూ.450 పలకగా, అప్పటినుంచి మొదలు ప్రతి సంవత్సరం రేటు పెరుగుతూనే వస్తుంది. 2021లో ఆంధ్రప్రదేశ్‌ లోని కడపకు చెందిన ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌తో కలిపి నాదర్‌గుల్‌ చెందిన మర్రి శశాంక్‌రెడ్డి లడ్డూను రూ.18.90 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఇక 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దయింది. 2019లో కొలను రామిరెడ్డి అనే వ్యక్తి రూ.17.60 లక్షలకు లడ్డూను సొంతం చేసుకోగా, 2018లో బాలాపూర్ లడ్డూ రూ.16.60 లక్షల ధర పలకింది. 2022 వేలంపాటలో ఇప్పటివరకు అత్యధిక ధరతో గత రికార్డులను అధిగమిస్తూ రూ.24.60 లక్షలకు వంగేటి లక్ష్మారెడ్డి లడ్డూను దక్కించుకున్నారు.

1994 నుంచి 2022 వరకు బాలాపూర్‌ లడ్డూ వేలం పాట వివరాలు:

 • 1994 – కొలను మోహన్‌రెడ్డి రూ.450
 • 1995 – కొలను మోహన్‌రెడ్డి రూ.4,500
 • 1996 – కొలను కృష్ణారెడ్డి రూ.18,000
 • 1997 – కొలను కృష్ణారెడ్డి రూ. 28,000
 • 1998 – కొలను మోహన్‌రెడ్డి రూ.51,000
 • 1999 – కల్లెం ప్రతాప్‌రెడ్డి రూ.65,000
 • 2000 – కల్లెం అంజిరెడ్డి రూ.66,000
 • 2001 – రఘునందన్‌చారి రూ.85,000
 • 2002 – కందాడ మాధవరెడ్డి రూ.1,05,000
 • 2003 – చిగిరింత బాల్‌రెడ్డి రూ.1,55,000
 • 2004 – కొలను మోహన్‌రెడ్డి రూ.2,01,000
 • 2005 – ఇబ్రహీం శేఖర్‌ రూ.2,80,000
 • 2006 – చిగిరింత శేఖర్‌రెడ్డి రూ.3,00,000
 • 2007 – రఘునందర్‌చారి రూ.4,15,000
 • 2008 – కొలను మోహన్‌రెడ్డి రూ.5,07,000
 • 2009 – సరిత రూ.5,15,000
 • 2010 – కొడాలి శ్రీధర్‌బాబు రూ.5,25,000
 • 2011 – కొలను బ్రదర్స్‌ రూ.5,45,000
 • 2012 – పన్నాల గోవర్థన్‌రెడ్డి రూ.7,50,000
 • 2013 – తీగల కృష్ణారెడ్డి రూ.9,26,000
 • 2014 – సింగిరెడ్డి జైహింద్‌రెడ్డి రూ.9,50,000
 • 2015 – కొలను మదన్‌ మోహన్‌రెడ్డి రూ.10,32,000
 • 2016 – స్కైలాబ్‌రెడ్డి రూ.14,65,000
 • 2017 – నాగం తిరుపతిరెడ్డి రూ.15,60,000
 • 2018 – శ్రీనివాస్‌గుప్తా రూ.16,60,000
 • 2019 – కొలను రామిరెడ్డి రూ.17,60,000
 • 2020 – కరోనా కారణంగా వేలం పాట నిర్వహించలేదు
 • 2021 – మర్రి శశాంక్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ రూ.18,90,000
 • 2022 – వంగేటి లక్ష్మారెడ్డి రూ.24.60,000,

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =