సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత

Samajwadi Party Founder Former UP CM Mulayam Singh Yadav Passes Away, Samajwadi Party Founder Mulayam Singh Yadav Passes Away, Former UP CM Mulayam Singh Yadav Passes Away, Former UP CM Mulayam Singh Yadav, Samajwadi Party Founder Mulayam Singh Yadav, Mango News, Mango News Telugu, Mulayam Singh Yadav Passes Away, Samajwadi Party Founder, Samajwadi Party, Mulayam Singh Yadav Dies, Mulayam Singh Yadav Dead, Mulayam Singh Yadav Passes Away, Samajwadi Party Founder Passes Away, Mulayam Singh Yadav Passes Away at 82, PM Modi Condolences To Family

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. యూపీ లోని గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఈరోజు (10 అక్టోబర్, సోమవారం) ఉదయం 8:30 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా వయోరీత్యా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు మేదాంత ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు ములాయం తనయుడు, ప్రస్తుత ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ దీనిని అధికారికంగా ధృవీకరించారు. పార్టీ ట్విట్టర్ హ్యాండిల్‌లో.. ‘గౌరవనీయమైన నా తండ్రి మరియు మనందరి నాయకుడు ఇక లేరు’ అని పేర్కొన్నారు.

కాగా ఆగష్టు 22నుంచీ ములాయం సింగ్ యాదవ్ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. అయితే అక్టోబర్ 2నుంచీ ఆయన ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. దీంతో అప్పటినుంచి ప్రతిరోజూ వైద్యులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేస్తుండటం తెలిసిందే. ఈ క్రమంలో ములాయం సింగ్ పరిస్థితి విషమంగా ఉందని, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో ప్రాణాలను రక్షించే పరికరాలపై ఉన్నారని గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రి ఆదివారం తెలిపింది. కాగా ఆయన ప్రస్తుతం మణిపురి నాపార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 82 సంవత్సరాల ములాయం సింగ్ యాదవ్ యూపీకి వరుసగా మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక ములాయం మృతిపై దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ లోని ఎటావా జిల్లా, సైఫాయి గ్రామంలో మూర్తిదేవి-సుఘర్‌సింగ్‌ యాదవ్‌ దంపతులకు ములాయం సింగ్ యాదవ్ 1939 నవంబర్‌ 22న జన్మించారు. యుక్తవయస్సు నుంచే రాజకీయాల పట్ల అక్షర్షితుడైన ఆయన 1967లో తొలిసారి యూపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1989లో తొలిసారి జనతాదళ్ తరపున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అనంతరం 1992లో సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. ఇక ములాయం కేంద్ర ప్రభుత్వంలో ఒకసారి రక్షణ మంత్రిగా కూడా పని చేశారు. రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పటినుంచి ఆయన మొత్తం 10 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. కాగా ములాయం భార్య సాధనా గుప్తా.. ఈ ఏడాది జూలైలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − fourteen =