గవర్నర్ వ్యాఖలపై ఎమ్మెల్సీ కవిత స్పందన, రాజకీయ వేదికగా మారిందంటూ ట్వీట్

TRS MLC Kavitha Responds Over Governor Tamilisai Soundararajan Comments on Telangana Govt, TRS MLC Kavitha Responds Over Governor Comments, Tamilisai Soundararajan Slams KCR Government, Tamilisai Soundararajan Comments on Humiliating Governor Office, Tamilisai Soundararajan Criticises KCR Government, Mango News, Mango News Telugu, Tamilisai Soundararajan , Telangana CM KCR, Telangana Governer Tamilisai Soundararajan, Governer Tamilisai Soundararajan, KCR Latest News And Updates, Tamilisai Soundararajan News And Live Updates

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా డా.తమిళిసై సౌందరరాజన్ మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు రాజ్ భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అడుగడుగునా ఇబ్బంది పెడుతుందని, ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ పాటించడం లేదని అన్నారు. రాజ్‌భవన్‌కు గౌరవం ఇవ్వడం లేదని, సీఎం, మంత్రులు, ఎంపీలు రావడం లేదన్నారు. మహిళా గవర్నర్ అని వివక్ష చూపుతున్నారా?, గౌరవం ఇచ్చినా ఇవ్వకున్నా పట్టించుకోనని, ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రజలకు సేవ చేస్తానని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో గవర్నర్‌ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. “తెలంగాణ గవర్నర్ కార్యాలయం టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ ను అపఖ్యాతి పాలుచేసేలా రాజకీయ వేదికగా మారింది. బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాలు తెలంగాణ ప్రజలను మోసం చేయలేవని వారు గ్రహించిన తరుణంలో గవర్నర్ నుంచి ఇలాంటి ప్రకటనలు వచ్చాయి” అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =