భారత్ జోడో యాత్ర: జమ్ముకశ్మీర్‌లోకి ప్రవేశించిన రాహుల్ పాదయాత్ర, పాల్గొన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్

Bharat Jodo Yatra Enters Jammu and Kashmir Shiv Sena MP Sanjay Raut Joins Rahul Gandhi Padayatra,Bharat Jodo Yatra Enters Jammu & Kashmir,Shiv Sena MP Sanjay Raut Joins, Rahul Gandhi Padayatra,Mango News,Mango News Telugu,Bharat Jodo Yatra,Priyanka Gandhi Participate In Rahul's Yatra, Bharat Jodo Yatra Madhya Pradesh, Rahul Gandhi Bharat Jodo Yatra, Rahul Gandhi Congress, Rahul Gandhi Padha Yatra, Congress Party , Indian National Congress, Inc Latest News And Updates, Sonia Gandhi, Priyanka Gandhi, Rahul Gandhi, Congress President Mallikarjun

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్ముకశ్మీర్‌లోకి ప్రవేశించింది. గురువారం సాయంత్రం ఆయన పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ మీదుగా జమ్ముకశ్మీర్‌లో ప్రవేశించారు. కాగా సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర 13 రాష్ట్రాల్లో కొనసాగి దాదాపు 3,300 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ఈ క్రమంలో యాత్ర ప్రారంభమైనప్పటినుండీ కేవలం టీ షర్ట్ ధరించి నడుస్తున్న రాహుల్ గాంధీ ఉత్తర భారతదేశంలో వణికిస్తున్న చలి కారణంగా తొలిసారిగా జాకెట్‌లో కనిపించారు. ఉదయం నుండి జమ్మూలోని పలు ప్రాంతాల్లో చిన్నపాటి జల్లులు కురుస్తుండటం వల్ల ఆయన రక్షణ దుస్తులు ధరించారు.

ఇక రాహుల్ పాదయాత్ర నేటితో 125వ రోజుకు చేరుకోగా.. శుక్రవారం ఉదయం జమ్ములోని కతువాలో ప్రారంభమైన ఈ యాత్రలో శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం) సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రౌత్ మాట్లాడుతూ.. నేను శివసేన తరపున ఇక్కడికి వచ్చాను. దేశ వాతావరణం మారుతోంది, ఈ యాత్ర ద్వారా సరికొత్త రాహుల్ గాంధీ ఆవిష్కృతమయ్యాడు. దేశప్రజలు ఆయనను తమ తదుపరి నాయకుడిగా చూస్తున్నారు. ప్రతిచోటా ఆయనకు మద్దతుగా జనాలు పెద్దఎత్తున తరలివస్తున్నారు, అని పేర్కొన్నారు. ఇక ఇదిలాఉండగా జనవరి 25న జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలోని బనిహాల్‌లో జాతీయ జెండాను ఎగురవేయబోతున్నారు మరియు రెండు రోజుల తర్వాత జనవరి 27న అనంత్‌నాగ్ మీదుగా శ్రీనగర్‌లోకి ప్రవేశించనున్నారు. జమ్ముకశ్మీర్‌లో మొత్తం 10 రోజులపాటు కొనసాగి ఈ నెల 30తో యాత్ర ముగియనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − fifteen =