మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కలకలం – 25వేల కోళ్లను వధించటానికి ఆదేశాలు

11 to Life Imprisonment, 2008 Ahmedabad bomb blasts, 2008 Ahmedabad serial blasts case, 2008 Ahmedabad serial bomb blasts, 2008 Ahmedabad serial bomb blasts case, 2008 Ahmedabad serial bomb blasts case verdict, 38 Convicts Sentenced to Capital Punishment In Ahmedabad 2008 Serial Explosions Case, Ahmedabad 2008 Explosions Case, Ahmedabad 2008 Serial Explosions, Ahmedabad 2008 Serial Explosions Case, Ahmedabad 2008 Serial Explosions Case 38 Convicts Sentenced to Capital Punishment 11 to Life Imprisonment, Ahmedabad 2008 Serial Explosions Case News, Ahmedabad serial blasts:, Mango News, Special court awards death penalty to 38 convicts

మహారాష్ట్ర లోని థానే జిల్లాలో ఒక్కసారిగా బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. షాహాపూర్ తహసీల్‌లోని వెహ్లోలి గ్రామంలోని ఒక కోళ్ల ఫారంలో సుమారు 100 కోళ్లు ఆకస్మికంగా మృతి చెందాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. థానే జిల్లా మేజిస్ట్రేట్, కలెక్టర్ రాజేష్ జె నార్వేకర్ మాట్లాడుతూ.. వ్యాధిని నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖను ఆదేశించామని తెలిపారు. చనిపోయిన పక్షుల నమూనాలను పరీక్ష కోసం పూణే ఆధారిత ప్రయోగశాలకు పంపామని వెల్లడించారు.

థానే జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ భౌసాహెబ్ దంగ్డే, H5N1 ఏవియన్ ఇన్ఫ్లుఎంజా కారణంగా పక్షులు చనిపోయాయని పరీక్షల ఫలితాలు నిర్ధారించాయి అని పేర్కొన్నారు. అయితే, ఇక్కడ బర్డ్ ఫ్లూ కేసులను గుర్తించినట్లు కేంద్ర మత్స్య మరియు పశుసంవర్ధక మంత్రిత్వ శాఖకు సమాచారం అందించామని డాంగ్డే తెలిపారు. ఈ నేపథ్యంలో.. జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రబలకుండా నియంత్రించడానికి 25వేల కోళ్లను విధించటానికి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =