నేడే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర

Amazon founder Jeff Bezos, Amazon Founder Jeff Bezos Flies to Space Today, Blue Origin Launch, Blue Origin New Shepard Space Craft, Blue Origin New Shepard Space Craft: Amazon Founder Jeff Bezos Flies to Space Today, Blue Origin-Jeff Bezos launch, Jeff Bezos launches to space aboard New Shepard rocket ship, Jeff Bezos launches to space with Blue Origin, Jeff Bezos’ Blue Origin Flight To Space, Mango News

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మంగళవారం నాడు అంతరిక్ష యాత్ర చేయనున్నారు. తన సొంత సంస్థ అయిన బ్లూ ఆరిజిన్‌ కు చెందిన న్యూ షెపర్డ్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ లో జెఫ్ బెజోస్ స్పేస్ లోకి వెళ్లనున్నారు. చంద్రుడిపై మానవుడు తొలిసారిగా కాలుమోపిన రోజైన జూలై 20 ను ఈ యాత్ర కోసం జెఫ్ బెజోస్‌ ఎంచుకున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు పశ్చిమ టెక్సాస్ ఎడారిలోని లాంచ్ సైట్ వన్ నుంచి న్యూ షెపర్డ్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ స్పేస్ లోకి దూసుకెళ్లనుంది. ఈ యాత్రలో భూమి యొక్క ఉపరితలం నుండి 100 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లనున్నారు. సరిగ్గా 11 నిమిషాల అనంతరం తిరిగి వారు భూమిపైకి చేరుకోనున్నారు.

పైలెట్ల అవసరం లేని, పునర్వినియోగ సబోర్బిటల్ రాకెట్ వ్యవస్థతో రూపొందించబడిన న్యూ షెపర్డ్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ లో జెఫ్ బెజోస్ సహా బెజోస్ సోదరుడు మార్క్, 82 ఏళ్ల మాజీ పైలట్‌ వాలీ ఫంక్ మరియు 18 ఏళ్ల విద్యార్థి ఆలివర్ డెమెన్‌ లు ప్రయాణించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద, చిన్న వ్యోమగాములు ఈ యాత్రలో పాల్గొనడం విశేషం. ఈ ప్రయోగాన్ని బ్లూ ఆరిజిన్ వెబ్‌సైట్‌లో మరియు యూట్యూబ్ ఛానెల్‌లో సాయంత్రం 5 గంటల నుంచి ప్రసారం చేయనున్నారు. మరోవైపు ఇటీవలే వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్‌ తో పాటుగా మరో నలుగురు యూనిటీ 22 అనే మానవసహిత వ్యోమనౌక ద్వారా అంతరిక్ష యాత్ర చేసిన సంగతి తెలిసిందే. రిచర్డ్‌ బ్రాన్సన్‌ బృందం 88 కిలోమీటర్ల ఎత్తువరకు వెళ్లి వచ్చారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − two =