ఈ రోజు అఖిలపక్ష సమావేశానికి కేంద్రం పిలుపు

Budget, sessions, Budget sessions from tomorrow, All Party Meeting, Budget sessions, Budget session from tomorrow, all-party meeting today, Budget Session, Finance Minister, Union Cabinet meet, Indian Politics, Indian Political News, Latest Indian Political News, Mango News Telugu, Mango News
All Party Meeting,Budget sessions, Budget session from tomorrow, all-party meeting today

దేశంలో ఎన్నికల వేడి రాజకీయాలను హీటెక్కిస్తుండగా.. మోడీ ప్రభుత్వం హయాంలో జరిగే ఆఖరి బడ్జెట్ సమావేశాలపై అంతా ఆసక్తి నెలకొంది.మరోవైపు  సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో  అన్న క్యూరియాసిటీ  కొనసాగుతోంది. ఇక  17వ లోక్‌సభ చివరి సమావేశాలు రేపటి నుంచి అంటే జనవరి 31 నుంచి జరగనున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఈ రోజు ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశానికి రావాల్సిందిగా.. అన్ని పార్టీల సభాపక్ష నేతలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఇప్పటికే సమాచారం ఇచ్చింది. ఈ భేటీలో సభ సజావుగా సాగించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో పాటు ముఖ్యమైన అంశాలపైన ఈ భేటీలో చర్చించే ఛాన్స్ ఉంది.

ఇక లోక్‌సభ చివరి సమావేశాలు  జనవరి 31 నుంచి ..ఫిబ్రవరి 9వ తేదీ వరకూ జరగనున్నాయి. ఈ నెల 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.  ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ ఇప్పటికే ప్రకటించారు.

17వ లోక్‌సభ గడువు ఈ ఏడాది జూన్‌ 16న ముగియనుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇవే చివరి పార్లమెంట్‌ సమావేశాలు కానున్నాయి. దీంతో ఇప్పటికే  కీలక బిల్లులన్నింటికీ గత సమావేశాల్లోనే ఆమోదం తెలపడంతో..ఈ బడ్జెట్‌లో  ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ నుంచి మేలో జరిగే ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం.. పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 17 =