కేంద్రం కీలక నిర్ణయం, కరోనా కట్టడికి 6 నగరాలకు ప్రత్యేక బృందాల నియామకం

Central Teams Deployed in Six Metro Cities to Assist States in COVID-19 Management

లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా ప్రభావం ఎక్కువున్న 6 మెట్రో నగరాల్లో కరోనా నియంత్రణ చర్యలను పర్యవేక్షించేందుకు ఆరు కేంద్ర బృందాలను నియమించింది. ముంబయి, అహ్మదాబాద్‌, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ఈ బృందాలు పర్యటించనున్నాయి. ఈ రాష్ట్ర ఆరోగ్య విభాగాలకు, మున్సిపల్ ఆరోగ్యాధికారులకు అండగా ఉంటూ కేంద్రబృందాల సాంకేతిక సహాయం అందజేయనున్నాయి.

ఈ బృందాలు తమకు కేటాయించిన నగరాలను ఈ వారంలోగా సందర్శిస్తాయి. కోవిడ్ -19 విషయంలో ప్రజారోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను సమీక్షిస్తాయి. ఈ బృందాలు రోజువారీ నివేదికలను రాష్ట్ర ఆరోగ్య విభాగానికి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు కూడా అందజేస్తాయి. అలాగే అత్యవసరమనిపించిన పక్షంలో తమ పర్యటన పూర్తికాకముందే అక్కడి పరిస్థితులపై తమ అభిప్రాయాలను జోడించి ఈ బృందాలు ముందుగానే నివేదిక అందజేయనున్నాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − eleven =