‘ఫెమా’ ఉల్లంఘ‌న‌ల‌ ఆరోప‌ణ‌లపై.. ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఇండియాపై కేసు న‌మోదు చేసిన ఈడీ

ED Files Case Against News Broadcaster BBC India Under FEMA Over Irregularities in Foreign Funding,ED Files Case Against News Broadcaster,ED Files Case Against BBC India,BBC India Under FEMA Over Irregularities,BBC India in Foreign Funding,Mango News,Mango News Telugu,ED files Foreign Exchange Management Act,ED files case against BBC under FEMA,ED lodges FEMA case against BBC India,ED files case against BBC under FEMA,ED probes BBC India,BBC India Latest News,BBC India Latest Updates

ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఇండియాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. ఫారిన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్మెంట్ యాక్టు (ఫెమా) ఉల్లంఘ‌న‌ల కింద గురువారం కేసు రిజిస్ట‌ర్ చేశారు. కాగా విదేశీ నిధుల వ్య‌వ‌హారంలో బీబీసీ ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలల క్రితం ముంబై మరియు ఢిల్లీలోని ఆ సంస్థ కార్యాలయాలపై దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) యొక్క అడ్మినిస్ట్రేటివ్ బాడీ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, బీబీసీ గ్రూప్ ఎంటిటీలు చూపించే ఆదాయం మరియు లాభాలు భారతదేశంలో తమ కార్యకలాపాల స్థాయికి సమగ్రంగా లేవని, అలాగే వీటికి సరిగా పన్ను కూడా చెల్లించబడలేదని పేర్కొంది. ఈ నేప‌థ్యంలోనే ఫెమా ఉల్లంఘ‌న‌ల కింద బీబీసీ ఇండియాపై ఈడీ కేసు రిజిస్ట‌ర్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అకౌంట్ పుస్త‌కాలు, ఫైనాన్షియ‌ల్ స్టేట్మెంట్స్‌ను రిలీజ్ చేయాల‌ని బీబీసీని ఈడీ కోరింది. అయితే కొన్ని దశాబ్దాల క్రితం గుజరాత్ లోని గోద్రాలో చోటుచేసుకున్న ఘర్షణలపై బీబీసీ వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రసారం చేసిన పరిణామాల నేపథ్యంలో ఇది జరగడం గమనార్హం.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − four =