వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై.. కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్

Union Minister of State For Steel Faggan Singh Kulaste Key Comments Over Vizag Steel Plant Privatisation,Union Minister Faggan Singh Kulaste,Faggan Singh Kulaste Key Comments Over Vizag,Faggan Singh Over Vizag Steel Plant Privatisation,Mango News,Mango News Telugu,Faggan Singh Kulaste Visits Vizag,Faggan Singh To Discuss VSP Privatization,VSP Privatization Issue,Faggan Singh Kulaste Latest News,Centre Chickens Out on Privatising VSP,Big Win For CM KCR,Cong Leader Demands All Party Delegation,VSP Privatization Live News,VSP Privatization Latest Updates,VSP Privatization Issue Latest News,Union Minister Faggan Latest News

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అమలును కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ ప్రకటించారు. గురువారం ఆయన విశాఖలో పర్యటించారు. పర్యటనలో భాగంగా స్టీల్ ప్లాంట్ ను సందర్శించిన ఆయన దీనికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫగ్గన్ సింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ప్రైవేటీకరణ విషయంలో ముందుకు వెళ్లడం లేదని, ముందుగా ఆర్ఐఎన్ఎల్ ను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ మనుగడ కోసం ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యంతో పాటుగా కార్మిక సంఘాల నేతలతోనూ చర్చిస్తామని పేర్కొన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టనున్నట్లు విశాఖలో ఫగ్గన్ సింగ్ ప్రకటించారు.

ఇంకా స్టీల్‌ప్లాంట్‌లో కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నామని, ముడిసరకు పెంపొందించే ప్రక్రియపై దృష్టి పెట్టామని స్పష్టం చేశారు. మరోవైపు బిడ్ వేయ్యాలని తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపుతున్న విషయంపై స్పందిస్తూ.. ఇది కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. కాగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంమై ఏపీ, తెలంగాణలోని అధికార పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న క్రమంలో కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బిడ్ వేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలన విషయమై విశాఖకు తెలంగాణ ప్రభుత్వం తరపున సింగరేణి అధికారులు రావడం, యాజమాన్యంతో చర్చించడం వంటి పరిణామాల నేపథ్యంలో నేటి కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి పర్యటన రెండు రాష్ట్రాలలో ఆసక్తిని కలిగించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 13 =