ఫిబ్రవరి నెలలో రూ.1,13,143 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదు

GST collections cross Rs 1 lakh cr for fifth month, GST Collections Cross Rs 1 Lakh Crore For Fifth Straight Month, GST collections cross Rs 1 lakh crore-mark, GST Collections Crossed Rs 1 Lakh Crore Mark, GST mop-up rises 7.4% in Feb, GST Revenues, GST Revenues Cross Rs 1 lakh, GST Revenues Cross Rs 1 lakh For Fifth Month In Row, GST Revenues Crossed Rs 1 Lakh Crores, GST Revenues Crossed Rs 1 Lakh Crores for Fifth Time, GST Revenues Crossed Rs 1 Lakh Crores for Fifth Time in a Row, Mango News

దేశంలో వస్తు మరియు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు వరుసగా ఐదో నెలలో కూడా లక్ష కోట్లు దాటాయి. ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,13,143 కోట్లుగా నమోదయినట్టుగా అధికారులు ప్రకటించారు. గత ఏడాది ఫిబ్రవరి నెల జీఎస్టీ ఆదాయతో పోల్చితే ఇది 7% ఎక్కువని తెలిపారు. రూ.1,13,143 కోట్లులో సీజీఎస్టీ వసూళ్లు రూ.21,092 కోట్లు కాగా, ఎస్‌జీఎస్టీ వసూళ్లు రూ.27,273 కోట్లు, ఐజీఎస్టీ రూ.55,253 కోట్లు (దిగుమతులపై వసూళ్లు రూ.24,382 కోట్లతో సహా) మరియు సెస్సుల నుంచి 9,525 కోట్లు(దిగుమతులపై వసూలు చేసిన రూ.660 కోట్లు) వసూలు అయ్యాయి.

లాక్ డౌన్ అనంతరం అక్టోబర్-2020 లో (రూ.1,05,155 కోట్లు), నవంబర్-2020 లో(రూ.1,04,963 కోట్లు), డిసెంబర్-2020 లో (రూ.1,15,174 కోట్లు), జనవరి-2021 లో రికార్డ్ స్థాయిలో (రూ.1,18,875 కోట్లు) జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. కాగా జీఎస్టీ ఆదాయం పెరగడం దేశంలో ఆర్థిక పునరుద్ధరణకు స్పష్టమైన సూచికని కేంద్ర ఆర్ధిక శాఖ వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − twelve =