ఫిఫా ప్రపంచ కప్: సెమీస్‌లో క్రొయేషియాపై ఘనవిజయం, ఫైనల్ చేరిన అర్జెంటీనా, మెరిసిన స్టార్ ప్లేయర్ మెస్సీ

FIFA World Cup Star Player Lionel Messi and Julian Alvarez Shines as Argentina Beats Croatia To Enter Finals,FIFA World Cup, Argentina win over Croatia,FIFA semis final,star player Messi shines,FIFA World Cup-2022,FIFA World Cup Argentina,FIFA World Cup Croatia,FIFA World Cup Semifinals,Mango News,Mango News Telugu,World Cup 2022 Knockout Stage,FIFA World Cup Schedule,FIFA Knockout Bracket,FIFA World Cup,FIFA World Cup Schedule 2022,FIFA World Cup 2022 Schedule,2022 FIFA World Cup Qatar,2022 FIFA World Cup Knockout Stage,FIFA World Cup Qatar 2022,FIFA World Cup 2022 Schedule

ఖతార్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ తుది అంకానికి చేరువైంది. మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా క్రొయేషియాపై ఘనవిజయం సాధించింది. బ్రెజిల్ వంటి దిగ్గజ జ‌ట్టును ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టిన క్రొయేషియా ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనాపై చతికిలపడింది. ఖతార్‌ లోని అల్బిసెలెస్టెస్ లుసైల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 2018 రన్నరప్ క్రొయేషియాను 3-0తో ఓడించింది. తద్వారా 2022 ఫిఫా ప్రపంచ కప్‌లో ఫైనల్స్‌కు చేరుకున్న మొదటి జట్టుగా అర్జెంటీనా నిలిచింది. అంతేకాదు 2014 తర్వాత మరోసారి ప్రపంచ కప్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఇక ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ మరియు కీలక ఆటగాడు జూలియన్ అల్వారెజ్ కలిసి మ్యాజిక్ చేశారు. ముందుగా మెస్సీ ఆట 34వ నిమిషంలో ల‌భించిన పెనాల్టీ కిక్‌ను టాప్-రైట్ కార్నర్‌ నుంచి గోల్‌గా మ‌లిచి అర్జెంటీనాకు ఆధిక్యం అందించాడు. కాగా ప్రపంచ కప్‌లో మెస్సీకి ఇది 5వ గోల్ కావడం విశేషం.

అనంతరం ఆట 39వ నిమిషంలో జూలియ‌న్ అల్వ‌రెజ్ చేసిన గోల్‌తో అర్జెంటీనా ఆధిక్యం 2-0కు చేరుకుంది. ఇక సెకండాఫ్‌లో అల్వ‌రెజ్ క్రొయేషియా డిఫెన్స్‌ను దాటుకుని మరోసారి గోల్ చేయడంతో అర్జెంటీనా 3-0తో క్రొయేషియాపై స్పష్టమైన ఆధిక్యం సాధించింది. చివరి వరకు ప్రయత్నించినా క్రొయేషియా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. ఈ విజయంతో అర్జెంటీనా ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలో ఆరోసారి ఫైనల్‌కు చేరుకుంది. ఇంతకుముందు 1978 మరియు 1986లో రెండుసార్లు ఫైనల్స్ గెలిచింది. అలాగే 1930, 1990 మరియు 2014లో రన్నరప్‌గా నిలిచింది. ఇక నేడు జరుగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌, అనూహ్య విజయాలతో దూసుకొచ్చిన ఆఫ్రికన్‌ సెన్సేషన్‌ మొరాకో జట్లు తలపడనున్నాయి. అలాగే డిసెంబర్‌ 17న (శనివారం) మూడోస్థానం కోసం మ్యాచ్‌ జరగనుంది. ఇదే క్రమంలో డిసెంబర్ 18న (ఆదివారం) ఫైనల్ మ్యాచ్‌ జరుగనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =