సుప్రీంకోర్టు జడ్జిలుగా ఐదుగురు పేర్లు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన కొలీజియం

Supreme Court Collegium Recommends 5 Names to Centre to Appoint as Judges in Supreme Court,Supreme Court Collegium,Supreme Court 5 Names to Centre,Judges in Supreme Court,Supreme Court Judges,Mango News,Mango News Telugu,Supreme Court India,India Supreme Court,Indian Supreme Court Judge,Supreme Court Latest News and Updates,Supreme Court Indian Judges,Indian Supreme Court Judges News and Live Updates,Supreme Court Indian News

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం డిసెంబర్ 13, మంగళవారం నాడు సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా(జడ్జిలు) నియామకం కోసం ఐదుగురు పేర్లను సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం సమావేశమై ఈ నియామకాలపై చర్చించింది. అనంతరం ఐదుగురు హైకోర్టు చీఫ్ జస్టిస్/జడ్జిలకు పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమించడానికై కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తునట్టు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం జడ్జిల సంఖ్య 28 ఉండగా, తాజాగా కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురు పేర్లను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తే ఆ సంఖ్య 33 కు చేరనుంది.

సుప్రీంకోర్టు జడ్జిలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన వారి వివరాలు:

  • జస్టిస్‌ పంకజ్ మిథల్ – చీఫ్ జస్టిస్, రాజస్థాన్ హైకోర్టు
  • జస్టిస్‌ సంజయ్ కరోల్ – చీఫ్ జస్టిస్, పాట్నా హైకోర్టు
  • జస్టిస్‌ పీవీ సంజయ్ కుమార్ – చీఫ్ జస్టిస్, మణిపూర్ హైకోర్టు
  • జస్టిస్‌ అహ్సానుద్దీన్ అమానుల్లా – జడ్జి, మణిపూర్ హైకోర్టు
  • జస్టిస్‌ మనోజ్ మిశ్రా – జడ్జి, అలహాబాద్ హైకోర్టు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + six =