సీరమ్‌ ఇనిస్టిట్యూట్ లో అగ్నిప్రమాదం, ఐదుగురు మృతి

Fire at Serum Institute of India, Fire breaks out at Covishield-maker Serum Institute, Fire breaks out at Serum Institute, Fire breaks out at Serum Institute building in Pune, Fire breaks out at Serum Institute of India, Fire Breaks Out at the Serum Institute, Major Fire Breaks Out at the Serum Institute of India in Pune, Mango News, Pune, Serum Institute Fire Breaking, Serum Institute of India, Serum Institute of India in Pune

పూణేలోని ప్రముఖ ఫార్మా సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సీరం ఇనిస్టిట్యూట్ కొత్త ప్లాంట్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు పూణే మేయర్ మురళీధర్ మోహోల్ వెల్లడించారు. భవనంలో ఉన్న మిగతావారిని సురక్షితంగా తరలించినట్టు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణం నిర్ధారించబడలేదని అయితే భవనంలో జరుగుతున్న వెల్డింగ్ పనులు ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

మరోవైపు ఈ ఘటనపై సీరమ్‌ ఇనిస్టిట్యూట్ అధినేత అదర్‌ పూనావాలా తీవ్ర విచారం వ్యక్తంచేశారు. “ఇప్పుడే కొన్ని బాధ కలిగించే అప్‌డేట్స్‌ అందుకున్నాము. దురదృష్టవశాత్తు ఈ సంఘటనలో కొంత ప్రాణనష్టం జరిగిందని తదుపరి దర్యాప్తులో మేము తెలుసుకున్నాము. ఇందుకు చాలా బాధపడుతున్నాం. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను” అని అదర్‌ పూనావాలా ట్వీట్ చేశారు. అలాగే ఇలాంటి ఆకస్మిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మల్టిఫుల్ ప్రొడక్షన్ భవనాల్లో రిజర్వులో ఉంచడం వలన కోవిషిల్డ్ ఉత్పత్తికి ఎటువంటి నష్టం జరగదని అన్ని ప్రభుత్వాలకు మరియు ప్రజలకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాను అని అదర్‌ పూనావాలా పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − fourteen =