మనుషులు–జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించే చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు

Telangana Govt Appoints State Level Committee over Mitigating Human-Animal Conflict

మనుషులు–జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించే చర్యల సూచనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ మేరకు జీవో నెంబర్-11 పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చైర్మన్ గా, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్), చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆర్.శోభ మెంబర్ కన్వీనర్ గా పదిమందితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా రాజ్యసభ సభ్యుడు కే.ఆర్.సురేశ్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏ.శాంతి కుమారి, మాజీ శాసన సభ్యుడు జి.అరవింద్ రెడ్డి, జాతీయ పులుల సంరక్షణ కేంద్రం (ఎన్టీసీఏ), వన్యప్రాణి సంరక్షణ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉన్నారు.

ముఖ్యంగా మనుషులను చంపుతున్న పులులు-సంబంధిత ఘటనలను తగ్గించేందుకు ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. మనుషులు–వన్యప్రాణుల మధ్య ఘర్షణ వాతావరణం, ప్రస్తుత చర్యలు, నష్ట పరిహారంపై కూడా కమిటీ సమీక్షించనుంది. అలాగే జంతువుల దాడుల్లో మనుషులు గాయపడటం, చనిపోవటం, పెంపుడు జంతువుల మృతి, పంటనష్టం చర్యలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. ఈ కమిటీని మూడు నెలల్లో రిపోర్టు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =