పరమవీరచక్ర, అశోకచక్ర పురస్కార గ్రహీతలకు కోటి నజరానా, సీఎం జగన్ ప్రకటన

Andhra CM announces ten-time hike in cash award for gallantry awardees, AP CM YS Jagan, AP gallantry awardees, AP Govt Hikes Cash Reward For Gallantry Award Winners, Cash Reward For Gallantry Award Winners, Cash Reward of Gallantry Awardees, gallantry, Gallantry Award Winners, Gallantry Awardees, gallantry awardees of kargil war, Mango News, Ten-Time Hike in Cash Reward of Gallantry Awardees

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు తిరుపతిలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన స్వర్ణిమ్‌ విజయ్‌ వర్ష్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత సాయిధ దళాలు విజయం సొంతం చేసుకుని 50 సంవత్సరాలు పూర్తవుతోన్న సందర్భంగా స్వర్ణిమ్‌ విజయ్‌ వర్ష్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరమవీరచక్ర, అశోకచక్ర సహా ఇతర గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలకు అందిస్తున్న నజరానాను పెంచుతున్నట్టు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. పరమవీరచక్ర, అశోకచక్ర పురస్కార గ్రహీతలకు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తుండగా పది రేట్లు పెంచి ఇకపై కోటి రూపాయలు అందిస్తామని చెప్పారు.

మహావీరచక్ర, కీర్తిచక్ర పురస్కార గ్రహీతలకు ఇప్పటివరకు రూ.8 లక్షలు ఇస్తుండగా, ఇకపై రూ.80 లక్షలు ఇస్తామని, అలాగే వీరచక్ర, శౌర్యచక్ర పురస్కార గ్రహీతలకు నజరానాను రూ.6 లక్షల నుంచి రూ.60 లక్షలకు పెంచుతున్నట్టు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఇక వీరమరణం పొందిన సైనికులకు రూ.50 లక్షలు అందించడాన్ని అమలు చేస్తామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ప్రకటన అనంతరం గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలకు అందించే నజరానా పెంపుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 12 =