ఒమిక్రాన్ చరిత్రలో ఏ వైరస్ ప్రబలనంతా వేగంగా విస్తరిస్తుంది : బిల్ గేట్స్

Bill Gates Says Omicron Spreading Faster than Any Virus in History, Coronavirus, COVID-19, covid-19 new variant, Mango News, Mango News Telugu, Microsoft Co-founder Bill Gates, Microsoft Co-founder Bill Gates Says Omicron Spreading Faster than Any Virus, Microsoft Co-founder Bill Gates Says Omicron Spreading Faster than Any Virus in History, New Covid 19 Variant, Omicron, Omicron covid variant, Omicron variant, omicron variant in India, omicron variant south africa, Update on Omicron

ప్రస్తుతం పలు ప్రపంచ దేశాలను ఒమిక్రాన్‌ కరోనా వేరియంట్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. మొదటగా దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు క్రమంగా ప్రపంచమంతా పాకుతుంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వ్యాప్తిపై బిలియనీర్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ట్విట్టర్ వేదికగా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. “జీవితం సాధారణ స్థితికి వస్తుందని అనిపించినప్పుడు, మనం మరోసారి కరోనా మహమ్మారి యొక్క తీవ్ర పరిస్థితుల్లోకి ప్రవేశిస్తున్నాం. ఒమిక్రాన్ మనందరి ఇంటికి చేరుకుంటుంది. నా సన్నిహిత మిత్రులు ఒమిక్రాన్ బారిన పడ్డారు. దీంతో నేను నా హాలిడే ప్లాన్‌లను చాలా వరకు రద్దు చేసుకున్నాను” అని పేర్కొన్నారు.

ఒమిక్రాన్ చరిత్రలో ఏ వైరస్ ప్రబలనంతా వేగంగా విస్తరిస్తుంది:

“ఒమిక్రాన్ చరిత్రలో ఏ వైరస్ ప్రబలనంతా వేగంగా విస్తరిస్తుంది. ఇది త్వరలో ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ఉంటుంది. ఒమిక్రాన్ ఎంత అనారోగ్యానికి గురి చేస్తుందో ఇప్పుడు మనకు పెద్దగా తెలియని విషయం. దీని గురించి మరింత తెలుసుకునే వరకు మనం దానిని తీవ్రంగా పరిగణించాలి. ఇది డెల్టా వేరియంట్ కంటే సగం తీవ్రత మాత్రమే అయినప్పటికీ, ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఇప్పటివరకు మనం చూసిన భారీ కరోనా ఉధృతి ఇదే కానుంది. ఈ సమయంలో మనమందరం ఒకరినొకరు చూసుకోవాలి. మాస్కులు ధరించడం, పెద్ద పెద్ద సమావేశాలకు దూరంగా ఉండటం మరియు వ్యాక్సిన్ తీసుకోవడం, బూస్టర్ డోస్ పొందడం వంటివి ఉత్తమ రక్షణ అందిస్తాయి” అని చెప్పారు.

“వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులు కూడా ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. ఇది ఆందోళన అంశం అనిపిస్తుంది కానీ ఎంత మంది వ్యక్తులు వ్యాక్సిన్ తీసుకున్నారు మరియు ఈ వేరియంట్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతోంది అనేదానికి ఇది పూర్తిగా కారకంగా ఉంటుంది. ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడకుండా లేదా చనిపోకుండా నిరోధించడానికి వ్యాక్సిన్స్ రూపొందించబడ్డాయి, ఆ పనిని అవి బాగా చేస్తున్నాయి. కాగా ఇక్కడ శుభవార్త ఏంటంటే ఒమిక్రాన్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. అది ఒకసారి దేశంలో ఆధిపత్యం చెలాయిస్తే, అక్కడ ఆ వేవ్ 3 నెలల కన్నా తక్కువ ఉంటుంది. ఆ కొన్ని నెలలు చెడ్డవి కావచ్చు, కానీ మనం సరైన చర్యలు తీసుకుంటే, ఈ మహమ్మారి 2022లో ముగుస్తుందని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. కరోనాతో మరో హాలిడే సీజన్‌లోకి వెళ్లడం నిరాశపరిచిందని నాకు తెలుసు. కానీ ఇది ఎప్పటికీ ఇలాగే ఉండదు. ఏదో ఒక రోజు మహమ్మారి ముగుస్తుంది, మనం ఒకరినొకరు ఎంత బాగా చూసుకుంటే అంత త్వరగా ఆ సమయం వస్తుంది” అని బిల్ గేట్స్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + three =