నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసీ చట్టాలను ఉల్లంఘించలేదు – తమిళనాడు విచారణ కమిటీ

Nayanthara and Vignesh Shivan Did Not Break Surrogacy Laws Says Tamil Nadu Health Ministry, Nayanthara and Vignesh Shivan, Tamil Nadu Health Ministry, Nayan Vignesh Did Not Break Surrogacy Laws,Mango News,Mango News Telugu, Nayanthara And Vignesh , Actress Nayanthara, Kollywood Director Vignesh Shivan, Nayanthara Surrogacy Babies, Nayanthara and Vignesh Shivan's Babies Uyir and Ulagam, Nayanthara Twins Uyir and Ulagam

ప్రముఖ నటి నయనతార మరియు దర్శకుడు విఘ్నేష్ శివన్‌ దంపతులకు ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా వారు సరోగసి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. వివాహం జరిగిన నాలుగు నెలలకే ఈ జంట కవల పిల్లలకు జన్మనివ్వడం చర్చనీయాంశం అయింది. ఈ జంట సరోగసీ నిబంధనలను పాటించలేదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విచారణ కమిటీ బుధవారం నివేదిక సమర్పించింది. దీనిలో నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసీ చట్టాలను ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది.

ఇక విఘ్నేష్, నయనతార తమ వివాహాన్ని 2016లో రిజిస్టర్ చేసుకున్నారని కమిటీ తన నివేదికలో పేర్కొంది. నయనతార దంపతులు సరోగసీ (రెగ్యులేషన్) చట్టం, 2021ని ఉల్లంఘించలేదని, అలాగే ఐసీఎంఆర్ పేర్కొన్న సరోగసీ మార్గదర్శకాలను కూడా వారు అనుసరించారని తెలిపింది. కాగా పిల్లలకు జన్మనిచ్చిన అద్దె తల్లి నయనతార బంధువు అని, ఆమె దుబాయ్‌లో ఉన్నారని తమిళనాడు ఆరోగ్య శాఖకు ఇచ్చిన నివేదికలో ఈ జంట పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే కమిటీ నివేదిక ప్రకారం వారు ఏ తప్పు చేయలేదని స్పష్టం కావడంతో ఈ వివాదం ఇకనైనా ఆగుతుందేమో చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =