వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుండి ప్రయాణికుల కార్లలో కనీసం 6 ఎయిర్‌ బ్యాగ్స్ తప్పనిసరి: నితిన్ గడ్కరీ

Nitin Gadkari Says Proposal Mandating Minimum of 6 Airbags in Passenger Cars to Come into Effect from 1st October 2023, 6 Airbags Mandatory In Passenger Cars , 6 Airbags October 1 Next Year, Nitin Gadkari , 6 Airbags Mandatory Oct1st Next Year, Mango News, Mango News Telugu, Nitin Gadkari Latest News And Updates, Road Transport And Highways Minister, Central Minister Nitin Gadkari, Nitin Gadkari Twitter Updates, Central Union Minister Nitin Gadkari, Nitin Gadkari Road Transport And Highways Minister, Road Transport And Highways Minister Nitin Gadkari, National News, Highway And Road Transport Vehichle Saftey

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం కీలక ప్రకటన చేశారు. ప్రయాణికుల కార్లలో (M-1 కేటగిరీ) కనీసం 6 ఎయిర్‌ బ్యాగ్‌లను తప్పనిసరి చేసే ప్రతిపాదనను 2023, అక్టోబర్ 01 నుండి అమలు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం నాడు వరుస ట్వీట్లు చేస్తూ, మోటారు వాహనాలలో ప్రయాణించే ప్రయాణీకులందరికీ వాటి ధర మరియు వేరియంట్‌లతో సంబంధం లేకుండా ప్రయాణికుల భద్రతే ప్రధాన ప్రాధాన్యత అని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆటో పరిశ్రమ ఎదుర్కొంటున్న గ్లోబల్ సప్లై చైన్ పరిమితులు మరియు స్థూల ఆర్థిక దృష్టాంతంపై దాని ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని, ప్యాసింజర్ కార్లలో (M-1 కేటగిరి) కనీసం 6 ఎయిర్‌ బ్యాగ్‌లను తప్పనిసరి చేసే ప్రతిపాదనను 2023, అక్టోబర్ 01 నుండి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

ముందుగా ప్రమాదాలను నివారించడంలో భాగంగా మోటారు వాహనంలో ప్రయాణించేవారి భద్రతను పెంపొందించడానికి, సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989ని సవరించడం ద్వారా భద్రతా లక్షణాలను మెరుగుపరచాలని గతంలో కేంద్రం నిర్ణయించింది. అయితే జనవరి 14, 2022న జారీచేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం 2022, అక్టోబర్ 2021 తర్వాత తయారు చేయబడిన కేటగిరీ M1 వాహనాలు 6 ఎయిర్‌ బ్యాగ్‌లతో (ముందు కూర్చున్న ఇద్దరికీ ఎదురుగా, సైడ్ కి రెండు చొప్పున నాలుగు, వెనుక కూర్చునే ఇద్దరికీ రెండు సైడ్ లకు కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్) ఉండాలని పేర్కొన్నారు. అయితే ఆటో ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 6 ఎయిర్‌ బ్యాగ్‌ల తప్పనిసరిగా నిర్ణయాన్ని 2023, అక్టోబర్ 01 నుండి అమలు చేయనున్నట్టుగా తాజాగా ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + nine =