పాకిస్తాన్‌లో 150 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత

Pakistan Nearly 150 year old Hindu Temple Demolished in Karachi,Pakistan Nearly 150 year old Hindu Temple,old Hindu Temple Demolished in Karachi,Pakistan old Hindu Temple Demolished,Mango News,Mango News Telugu,Temple Demolished in Karachi,Old Mari Mata Temple,A Century Old Hindu Temple Demolished,Dacoits attack Hindu temple,Hindu temple Demolished with rocket launchers,Mari Mata Mandir karachi,Mari Mata Mandir Pakistan,Pakistan Hindu Temple Latest News,Pakistan Hindu Temple Latest Updates,Pakistan Hindu Temple Live News,Pakistan Hindu Temple Demolished News

పాకిస్తాన్‌లో హిందూ ఆలయాల కూల్చివేత వ్యవహారం సంచలనంగా మారింది. తాజాగా సింధ్ ప్రాంతంలోని 150 ఏళ్ల నాటి మారి మాతా ఆలయాన్ని కూల్చారు. అది జరిగి 24 గంటలు గడవకముందే మరో ఆలయంపై పాకిస్తానీ దుండగులు రాకెట్ లాంచర్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. సింధ్ ప్రావిన్సులో దుండగులు హిందూ ఆలయంపైనా, చుట్టుపక్కల ఉన్న హిందువుల ఇళ్ల మీదా రాకెట్ లాంఛర్లతో విచక్షణారహితంగా దాడులు చేశారు. రాకెట్ లాంచర్లు జనావాసాల వద్ద పడ్డాయని కానీ అవి పేలకపోవవడంతో ప్రాణనష్టం జరగలేదని లేదంటే… మరింత విధ్వంసం జరిగి ఉండేదని సమాచారం.

అంతకముందు కరాచీలో దాదాపు 150 ఏళ్ల చరిత్ర గల మారి మాతా ఆలయాన్ని కూల్చివేశారు. దేవాలయం శిథిలమై, ప్రమాదకరంగా మారడంతో కూల్చివేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఈ ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆలయాన్ని కూల్చివేశారని… ఈ ప్రాంతంలో హిందూ ఆలయాలను పర్యవేక్షిస్తున్న రామ్‌నాథ్‌ మిశ్ర చెప్పారు. ఆలయ ప్రహరి, ప్రధాన ద్వారాన్ని వదిలేసి… లోపలి నిర్మాణాన్ని కూల్చివేశారన్నారు. సుమారు 400 నుంచి 500 చదరపు గజాల విస్తీర్ణంలోని ఈ ఆలయంపై… గత కొంతకాలంగా కొందరు కన్నేశారని చెప్పారు. ఆలయం ఆవరణలో గుప్త నిధులు ఉన్నాయన్న కథలు కూడా వ్యాప్తిలో ఉన్నాయని సమాచారం. ఆలయ నిర్మాణం చాలా పురాతనమైంది. కరాచీలోని 150 ఏళ్ల నాటి పవిత్ర పుణ్యక్షేత్రం మారి మాతా ఆలయాన్ని కూల్చివేశారు. ఆ ప్రాంతంలో కరెంటు లేని సమయంలో అర్థరాత్రి ఈ కూల్చివేత జరిగిందని స్థానికులు చెప్పారు. ఆలయాన్ని కూల్చేందుకు డిగ్గర్లు, బుల్డోజర్లు ఉపయోగించారు. బయటి గోడలు, ప్రధాన ద్వారాన్ని మాత్రం వదిలేసి వారు మొత్తం లోపలి నిర్మాణాన్ని ధ్వంసం చేశారు.

ఆలయ భూమిని షాపింగ్‌ ప్లాజా ప్రమోటర్‌కు 7 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. మారి మాతా ఆలయాన్ని కరాచీలోని మద్రాసీ హిందూ సమాజం నిర్వహిస్తోంది. నిర్వాహకులు అయిష్టంగానే తాత్కాలికంగా దేవతా విగ్రహాలను చిన్న గదిలోకి తరలించి.. అక్కడ కొన్ని పునర్నిర్మాణ పనులు చేపట్టారని స్థానికులు తెలిపారు. గతేడాది జూన్‌లో కూడా మారిమాత ఆలయంలోని దేవతా విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారని పంచ్‌ముఖి హనుమాన్‌ మందిర్‌ కేర్‌టేకర్‌… రామ్‌నాథ్‌ మిశ్రా మహారాజ్‌ తెలిపారు. ఆలయం కూల్చివేతకు సంబంధించి తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని పేర్కొన్నారు. ఇటీవల పాకిస్తాన్‌ మహిళ సీమా హైదర్ పబ్జీలో పరిచయమైన భారత యువకుణ్ని వెతుక్కుంటూ వెళ్లిపోయినందుకు… ప్రతీకారంగా కొంతమంది ఆగంతకులు గతంలో హెచ్చరించారు. బహుశా ఇది వారి చర్యే అయి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =