పాక్ మాజీ ప్రధానికి పదేళ్ల జైలు శిక్ష

Pakistans, Ex PM, Imran Khan, Imran Khan Bushra Bibi, Pakistan jailed, Shah Mahmood Qureshi, prime minister, National Political Parties,Indian Political News Live Updates, Pakistan News updates, Pakistan News, Pakistan Political Updates, Pakistan Leaders, Mango News Telugu, Mango News
Pakistan, Imran Khan, ex pm imran khan

దయాది దేశం పాకిస్థాన్‌లో మరికొద్దిరోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలు సిద్ధమవుతున్నాయి. ఈ సమయంలో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊహించని షాక్ తగిలింది. సైఫర్ కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా.. ఇప్పుడు ఆయనకు జైలు శిక్ష పడడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ వ్యవహారం పాకిస్థాన్‌లో కాక రేపుతోంది.

ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో అమెరికాలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం ఓ కీలక సమచారాన్ని పాక్‌కు చేరవేసింది. పీటీఐ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అమెరికా నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అమెరికా నుంచి పెద్ద ఎత్తున ముప్పు పొంచి ఉందని పాక్ ఎంబసీ.. పాకిస్థాన్ పీఎంవోకు లేఖను పంపించింది. అయితే ఆ తర్వాత కొద్దిరోజులకు ఓ బహిరంగ సభలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగిస్తూ.. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాగే ఆ కుట్రలకు సాక్షాలు ఇవేనని కొన్ని పత్రాలను చూపించారు. అమెరికాలోని పాక్ ఎంబసీ ఆ పత్రాలను పంపించిందని పేర్కొన్నారు.

అయితే రహస్య పత్రాలను భహిరంగంగా చూపించడంతో ఇమ్రాన్ ఖాన్‌పై నేరాభియోగాలు నమోదయ్యాయి. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్‌ను ఉల్లంఘించారనే అభియోగాల కింద ఇమ్రాన్ ఖాన్‌, అప్పటి మాజీ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీలపై కేసు నమోదయింది. ఇటీవల తోషాఖాన్ కేసు నుంచి ఇమ్రాన్ ఖాన్ బయటపడిన వెంటనే..  సైఫర్ కేసులో ఆయన్ను అరెస్ట్ చేసి రావల్పిండిలోని అడియాలా జైలుకు తరలించారు. తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాస్థానం ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలవరించింది. ఇమ్రాన్‌తో పాటు షా మహమ్మద్ ఖురేషీకి కూడా శిక్ష విధించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =