బడ్జెట్‌లో ఏఏ అంశాలుండబోతున్నాయి?

budget, Millions of hopes on budget,included in the budget,2024 budget, Finance Minister, Nirmala Sitharaman, Budget Statement, Union Budget, general expenses, Telangana Latest News And Updates, Telangana Politics,Hyderabad News,Telangana News, Mango News Telugu, Mango News
Millions of hopes on budget,included in the budget,2024 budget, Finance Minister, Nirmala Sitharaman

ఈ సారి ఓటాన్ బడ్జెట్ ఎలా ఉండబోతోంది. ఎలక్షన్‌  ఇయర్‌ కావడంతో సంక్షేమ పథకాలపై దృష్టి సారిస్తారా ? లేక ఆర్ధిక వృద్ధి పరుగులు పెట్టేలా బడ్జెట్‌ను రూపొందిస్తారా ? వేతన జీవికి ఊరట ఇస్తూనే , పరిశ్రమలకు పెద్దపీట వేస్తారా ? ఇలా సవా లక్ష ప్రశ్నలు నిర్మలమ్మ పద్దు ముందున్నాయి.  ఐతే ఆరు అంశాలను ప్రధానంగా చేసుకుని బడ్జెట్‌ ఉండే అవకాశం ఉందంటున్నారు ఆర్ధిక రంగ నిపుణులు.

ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టున్నారు. లోక్‌సభ ఎన్నికల వల్ల 2024-25 ఆర్థిక బడ్జెట్‌లో పెద్ద ప్రకటనలు ఏమీ ఉండవని అనుకున్నప్పటికీ ఎలక్షన్స్‌ దృష్టిలో పెట్టుకుని జనాకర్షక బడ్జెట్ ఉంటుందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆరు అంశాలు ప్రధానంగా తీసుకుని ఈ సారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. క్యాపెక్స్‌ వృద్ధి రెట్టింపు చేయడం, రోడ్లు రైల్వేలపై దృష్టిపెట్టడం, గ్రామీణాభివృద్ధి తోపాటు వ్యవసాయ రంగాభివృధ్ధిపైన దృష్టి, డిజిన్వెస్ట్మెంట్‌ను వేగవంతం చేయడం, సోషల్‌ సేఫ్టీలో, మహిళాభివృద్ధిపై ఫోకస్‌ చేయబోతున్నారు.

ఇక చివరగా  తయారీ రంగం, గ్రీన్‌,క్లీన్‌ ఎనర్జీమీద ఫోకస్‌ చేయబోతున్నారు. ఇవేకాకుండా  రెవెన్యూ, వ్యయం, ఆర్థిక పనితీరు, ద్రవ్యలోటు- అంచనాలపై కూడా ఎక్కువగా ఫోకస్​ పెట్టేఅవకాశం ఉంది. రక్షణ, రైల్వేలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి పై కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాల విభాగానికి అధిక నిధుల కేటాయింపు, డిజిటలైజ్డ్ ఇండియా, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వెహికల్స్ , బ్రాడ్​ బ్రాండ్​ వృద్ధిపై దృష్టి సారించడం ఈ సారి బడ్జెట్‌లో కీలకంగా ఉండే అవకాశం ఉందని ఆర్ధిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

బీమా రంగం దాని పరిధిని పెంచడానికి కొన్ని రకాల బీమా ఉత్పత్తులపై జీఎస్​టీని తగ్గించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తయారీ రంగాభివృద్ధి  కోసం ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కింద రంగాల విస్తరణ, గ్రీన్ ఎనర్జీకి పరివర్తన దిశగా నిరంతర ప్రోత్సాహం అందించే దిశగా బడ్జెట్‌ ఉండనుంది.

శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, వాయు కాలుష్య సమస్యలను పరిష్కరించడానికి ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నాల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఈ సారి బడ్జెట్‌లో దృష్టి సారించనుంది. గ్రామీణ కేంద్రీకృత ద్విచక్ర, ఎంట్రీ లెవల్ ఫోర్ వీలర్ ఓఈఎంలతో పాటు ఇలాంటి ఓఈఎంలకు సరఫరా చేసే ఆటో అనుబంధ సంస్థలకు ఈ దృష్టి ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేటాయింపులు పెరగడం, వ్యవసాయ రంగంలో క్రియాశీల పథకాలు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చేలా బడ్జెట్‌ రూపకల్పన ఉండే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =