కేరళ పర్యటనలో ప్రధాని మోదీ.. వందేభారత్ ట్రైన్ మరియు దేశంలోనే తొలి వాటర్ మెట్రో సర్వీస్‌ ప్రారంభం

PM Modi Flagged Off Kerala's First Vande Bharat Express and India's 1st Water Metro Service Today,PM Modi Flagged Off Kerala's First Vande Bharat Express,India's 1st Water Metro Service Today,Kerala's First Vande Bharat Express,Mango News,Mango News Telugu,PM Modi flags off Kerala's first Vande Bharat train,Prime Minister Narendra Modi,PM Modi in Kerala Live Updates,PM to flag off Thiruvananthapuram,Vande Bharat Express Latest News,Vande Bharat Express Live Updates,Vande Bharat Express Live News

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన కోసం కేరళ విచ్చేశారు. పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం తిరువనంతపురం మరియు కాసర్‌గోడ్ మధ్య రాష్ట్రంలోని మొట్టమొదటి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్ నుండి జెండా ఊపి ప్రారంభించారు. కాగా ఈ రైలు మొత్తం 11 జిల్లాలను.. తిరువనంతపురం, కొల్లాం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కాడ్, పతనంతిట్ట, మలప్పురం, కోజికోడ్, కన్నూర్ మరియు కాసర్‌గోడ్‌లను కవర్ చేస్తుంది. కాగా రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ 1 నుండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించడానికి ముందు, ప్రధాని మోదీ రైలులోని ఒక కోచ్‌లో పాఠశాల విద్యార్థులతో సంభాషించారు. అనంతరం కొచ్చి వెళ్లి దేశంలోనే తొలి వాటర్ మెట్రోను ప్రారంభించారు. దీనిద్వారా కొచ్చిలో మరియు చుట్టుపక్కల ప్రజలకు సురక్షితమైన మరియు స్నేహపూర్వక ప్రయాణాన్ని అందించడంతో పాటు పర్యాటకాన్ని కూడా పురోగమింపజేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

కేరళ రాష్ట్రం అవగాహన మరియు విద్యావంతుల రాష్ట్రం అని, ఇక్కడి ప్రజల కృషి మరియు వినయం వారి గుర్తింపులో భాగం అని తిరువనంతపురంలో ప్రధాని మోదీ అన్నారు. అలాగే దిండిగుల్ పలానీ- పాలక్కాడ్ సెక్షన్ విద్యుదీకరణ పనులతో పాటు ఫస్ట్ డిజిటల్ సైన్స్ పార్కులను కూడా ప్రధాని ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తదితరులు పాల్గొన్నారు. మొదటి దశలో, వాటర్ మెట్రో ఎనిమిది ఎలక్ట్రిక్-హైబ్రిడ్ బోట్లతో రెండు మార్గాల్లో.. వైపిన్‌ నుండి హైకోర్టుకు, అలాగే కాక్కనాడ్‌ నుండి వైట్టిల మార్గాల్లో ప్రయాణిస్తుందని అధికారులు వెల్లడించారు. హైకోర్టు నుంచి వైపిన్ మార్గంలో సింగిల్ జర్నీ టికెట్ ధర రూ.20గా నిర్ణయించిన అధికారులు, వైట్టిల నుంచి కాక్కనాడ్ రూట్‌కు రూ.30గా నిర్ణయించారు. ఇక అంతకుముందు మంగళవారం ఉదయం తిరువనంతపురం చేరుకున్న ప్రధానికి ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా విమానాశ్రయం నుంచి రైల్వేస్టేషన్ వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించిన మోదీకి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 17 =