నవంబర్ 25న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్న పీఎం మోదీ

Foundation Stone of Noida International Airport, Mango News, Modi to lay foundation stone for Noida International Airport, Narendra Modi to Lay the Foundation Stone of Noida International Airport, Noida, Noida Airport, Noida International Airport, PM Modi to lay foundation stone for Noida International Airport, PM Modi to lay foundation stone of Noida International Airport on Nov 25, pm narendra modi, PM Narendra Modi to Lay the Foundation Stone of Noida International Airport, PM Narendra Modi to Lay the Foundation Stone of Noida International Airport on November 25, prime minister modi

ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 25, గురువారం మధ్యాహ్నం 1 గంటకు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో గౌతమ్ బుద్ధ నగర్‌లోని జెవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఎన్ఐఏ) శంకుస్థాపన చేయనున్నారు. దీంతో దేశంలో ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలను కలిగి ఉన్న ఏకైక రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ అవతరించనుంది. కనెక్టివిటీని మరింత పెంపొందించడం మరియు భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండే విమానయాన రంగాన్ని సృష్టించడంలో భాగంగా ప్రధాని మోదీ విజన్ కు అనుగుణంగా ఈ విమానాశ్రయం అభివృద్ధి చేయబడింది.

ఇటీవలే ప్రారంభించబడిన ఖుషీనగర్ విమానాశ్రయం, అయోధ్యలో నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా పలు కొత్త అంతర్జాతీయ విమానాశ్రయాల అభివృద్ధికి సాక్ష్యాలుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నిలవనుంది. రూ.10,050 కోట్లకు పైగా వ్యయంతో ఈ విమానాశ్రయం యొక్క మొదటి దశ అభివృద్ధి పనులు జరుగనున్నాయి. మొత్తం 1300 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉండగా, మొదటి దశ పూర్తయిన అనంతరం ఈ విమానాశ్రయం సంవత్సరానికి 1.2 కోట్ల మంది ప్రయాణీకులకు సేవలందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, అలాగే ఈ పనిని 2024 నాటికి పూర్తి చేయడానికి షెడ్యూల్ చేయబడిందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =