కల్నల్ సంతోష్‌బాబుకు మహా వీర్ చక్ర పురస్కారం, రాష్ట్రపతి నుంచి అందుకున్న కుటుంబసభ్యులు

Galwan Valley Clash Hero Colonel Santosh Babu Awarded Maha Vir Chakra Posthumously, Chinese Army, Colonel Santosh Babu, Colonel Santosh Babu accorded Mahavir Chakra posthumously, Colonel Santosh Babu Wife, Galwan braveheart Colonel Santosh Babu, Galwan martyrs honoured, Galwan Valley, Galwan valley clash hero Colonel Santosh Babu accorded Mahavir Chakra posthumously, Mahavir Chakra Posthumously gallantry award, Mahavir Chakra Posthumously To Colonel Santosh Babu, Mango News, President Kovind, President Kovind Confers Mahavir Chakra Posthumously To Colonel Santosh Babu, President of India, Ram Nath Kovind

కల్నల్ సంతోష్‌బాబుకు కేంద్ర ప్రభుత్వం “మహా వీర్ చక్ర” పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. సైనిక బ‌ల‌గాల‌కు ఇచ్చే అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క వార్‌టైం గ్యాలంట్రీ అవార్డుల్లో మహా వీర్ చక్ర రెండో అత్యున్నత పురస్కారం. గత సంవత్సరం జూన్ లో భారత్‌-చైనా సరిహద్దుల్లో లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలో తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేటకు చెందిన కల్నల్ ‌బిక్కుమల్ల సంతోష్‌ బాబు వీర మరణం పొందారు. 16 బిహార్‌ రెజిమెంట్‌కు కమాండింగ్ అధికారిగా ఉన్న సంతోష్‌ బాబు చైనా జవాన్ల దురాక్రమణను విజయవంతంగా తిప్పికొట్టారు. ఈ ఘటనలో సంతోష్‌బాబుతో పాటుగా 21 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. దేశం కోసం సంతోష్‌బాబు చేసిన సేవలను స్మరిస్తూ, మరణాంతరం కేంద్రప్రభుత్వం ఆయనకు మహా వీర్ చక్ర పురస్కారం ప్రకటించింది.

ఈ నేపథ్యంలో నవంబర్ 23, మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్ లో జరిగిన గ్యాలెంటరీ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా సంతోష్‌బాబు సతీమణి మరియు తల్లి మహా వీర్ చక్ర అవార్డు అందుకున్నారు. అలాగే పలువురు జవాన్లకు వీర్ చక్ర, శౌర్య చక్ర, కీర్తి చక్ర అవార్డులను రాష్ట్రపతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + nine =