కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ కాంట్రాక్టు దక్కించుకున్న టాటా ప్రాజెక్ట్స్

New Parliament Building Construction Contract, News Parliament Building, News Parliament Building Construction, Parliament Building Construction Contract, Tata Group wins new Parliament building construction, Tata Projects Ltd, Tata Projects Ltd Wins New Parliament Building Construction Contract, Tatas Win Contract To Build New Parliament Building

కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనులను టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దక్కించుకుంది. 861.90 కోట్ల రూపాయలతో బిడ్ దాఖలు చేసి కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ కాంట్రాక్టును టాటా ప్రాజెక్ట్స్ దక్కించుకున్నట్టు అధికారులు తెలిపారు. టాటా ప్రాజెక్ట్స్, ఎల్‌ అండ్‌ టీ మరియు షాపూర్జీ పల్లోంజి గ్రూప్ ఈ కాంట్రాక్టు కోసం పోటీపడగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును టాటా ప్రాజెక్ట్స్‌ సొంతం చేసుకుంది. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టు కింద ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనానికి సమీపంలో కొత్త పార్లమెంట్ భవనం నిర్మించనున్నారు. ఈ నిర్మాణం 21 నెలల్లో పూర్తిచేయాలని భావిస్తున్నారు. కొత్త పార్లమెంట్‌ భవనాన్ని త్రిభుజాకారంలో నిర్మించనున్నట్టు సమాచారం. మరోవైపు కొత్త భవనం నిర్మాణం పూర్తయ్యాక ప్రస్తుతం ఉన్న ఉత్తర, దక్షిణ బ్లాకులను మ్యూజియంగా మార్చనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =