కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడేసిన టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా.. దుబాయ్‌ ఓపెన్‌తో ముగిసిన కెరీర్‌

Indian Tennis Icon Sania Mirza Ends Career with First Round Defeat in WTA Dubai Tennis Championships, Indian Tennis Icon Sania Mirza Ends Career, Sania Mirza Ends Career, Sania Mirza First-Round Defeat in WTA Dubai, Sania Mirza in WTA Dubai Tennis Championships, Mango News, Mango News Telugu, Dubai Tennis Championships 2023,Dubai Open 2023 Players,Dubai Open Prize Money,Dubai Open Tennis 2023 Tickets,Dubai Tennis 2023 Schedule,Dubai Tennis Championships 2022 Players,Dubai Tennis Championships Schedule,Dubai Tennis Championships Winners,Dubai Tennis Tournament 2022,Sania Mirza Age,Sania Mirza Best In Career,Sania Mirza Biography In English,Sania Mirza Child Age,Sania Mirza Debut First Entry,Sania Mirza Instagram,Sania Mirza Net Worth,Wta Dubai Tennis Championships,Wta Dubai Tennis Championships 2021,Wta Dubai Tennis Championships 2022,Wta Grand Slam Finals,Wta Tennis Earnings

భారత టెన్నిస్ ఐకాన్ సానియా మీర్జా 36 ఏళ్ల వయస్సులో తన 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికింది. ఈ మేరకు ఆమె మంగళవారం దుబాయ్ ఓపెన్‌లో భాగంగా జరిగిన టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్‌లో ఓటమితో కెరీర్‌ను ముగించింది. మహిళల డబుల్స్ టైలో అమెరికా భాగస్వామి మాడిసన్ కీస్‌తో కలిసి ఆమె వరుస సెట్లలో ఓడిపోయింది. ఈ జంట 4-6, 0-6తో సరిగ్గా ఒక గంట వ్యవధిలో రష్యాకు చెందిన వెర్నోకియా కుడెర్మెటోవా మరియు లియుడ్మిలా సామ్సోనోవా జోడీ చేతిలో ఓటమి చెందింది. కాగా గత నెల ప్రారంభంలో, రోహన్ బోపన్నతో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో ఓడిపోయిన సానియా మీర్జా తన గ్రాండ్‌స్లామ్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రాడ్ లావర్ ఎరీనాలో జరిగిన ఈ ఫైనల్ పోరులో సానియా-బోపన్న జోడీ, బ్రెజిల్ జోడీ లూయిసా స్టెఫానీ, రాఫెల్ మటావో చేతిలో ఓడిపోయింది.

టెన్నిస్‌ కెరీర్‌లో సానియా పయనం..

కాగా గత నెల ప్రారంభంలో, రోహన్ బోపన్నతో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో ఓడిపోయిన సానియా తన గ్రాండ్‌స్లామ్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రాడ్ లావర్ ఎరీనాలో జరిగిన ఈ ఫైనల్ పోరులో సానియా-బోపన్న జోడీ 6-7(2) 2-6తో బ్రెజిల్ జోడీ లూయిసా స్టెఫానీ, రాఫెల్ మటావో చేతిలో ఓడిపోయింది. ఇక 2001 నుంచి 2003వరకు జూనియర్‌ సర్క్యూట్‌లో రాణించిన సానియా మీర్జా ఈ క్రమంలో జూనియర్‌ స్థాయిలో 10 సింగిల్స్‌, 13 డబుల్స్‌ టైటిళ్లు గెలుచుకుంది. అనంతరం 2002-03 మధ్య ప్రొఫెషనల్‌ ప్లేయర్‌గా మారింది. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీతో తొలిసారి డబ్ల్యూటీఏ టోర్నీ హైదరాబాద్‌ ఓపెన్‌ బరిలోకి దిగే అవకాశం దక్కించుకొంది. 2002లో ఆసియా క్రీడల్లో లియాండర్‌ పేస్‌తో కలసి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్య పతకం సాధించింది. 2005 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సింగిల్స్‌లో మూడోరౌండ్‌కు చేరుకొని అందరి దృష్టినీ ఆకర్షించింది.

కెరీర్‌లో అగ్రస్థానానికి సానియా..

అలాగే 2005లో యూఎస్‌ ఓపెన్‌ నాలుగో రౌండ్‌కు చేరి సంచలనం సృష్టించిన సానియా, 2006 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సీడింగ్‌ దక్కించుకోవడంతో పాటు సింగిల్స్‌లో 27వ ర్యాంక్‌కు చేరింది. ఈ క్రమంలో 2010 వరకు సింగిల్స్‌, డబుల్స్‌లో రాణించిన సానియా మీర్జా.. ఆ తర్వాత మణికట్టు గాయం కారణంగా డబుల్స్‌పైనే దృష్టిసారించింది. 2010లో ఆసియా క్రీడల సింగిల్స్‌లో కాంస్యం, మిక్స్‌డ్‌లో రజతం సొంతం చేసుకొంది. 2011లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ డబుల్స్‌లో ఫైనల్‌ చేరిన సానియా వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గడం విశేషం. స్విస్‌ ప్లేయర్‌ మార్టినా హింగిస్‌తో జత కట్టిన సానియా డబుల్స్‌లో నెం 1 ర్యాంక్‌ను అందుకొంది. 90 వారాలకు పైగా నెం 1 ర్యాంక్‌లో కొనసాగింది. 2015లో వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌ విజేతలుగా నిలిచిన సానియా-హింగిస్‌ జంట, ఆ తర్వాత 2016 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచింది.

అవార్డులు, వ్యక్తిగత విషయాలు..

ఇక 2004లో అర్జున, 2015లో మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డులను సానియా పొందింది. అలాగే భారత ప్రభుత్వం నుంచి 2006లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్‌ వంటి అత్యున్నత పౌర పురస్కారాలను సైతం అందుకొంది. కాగా సానియా తండ్రి ఇమ్రాన్‌ మీర్జా స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌ కాగా, తల్లి నసీమా ముద్రణకు సంబంధించిన బిజినెస్‌ నిర్వహించేవారు. ఇక సానియా మీర్జా 2010 ఏప్రిల్‌ 12న పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కుమారుడు, ఇజాన్‌ మాలిక్‌ ఉన్నాడు. ఇక ఇటీవలే ప్రముఖ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్‌సీబీ.. త్వరలో జరుగనున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో తమ మహిళల జట్టుకు మెంటార్‌గా భారత సానియా మీర్జాను నియమించుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 16 =