ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ నుండి తప్పుకున్న వివో – కొత్త స్పాన్సరర్ గా టాటా

cricket, Cricket Latest News, cricket live updates, Indian Premier League, Indian Premier League Latest News, Indian Premier League Latest Updates, Indian Premier League Live Updates, Indian Premier League News, IPL title sponsor, IPL Title Sponsor Latest News, Mango News, One of India’s largest business conglomerates, Rs 670 Crore, Tata Groups, Tata Groups To Replace VIVO, Tata Groups To Replace VIVO As IPL Title Sponsor, Tata replaces Vivo as IPL title sponsor, To Pay Rs 670 Crore, VIVO As IPL Title Sponsor

చైనా మొబైల్‌ కంపెనీ వివో ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సరర్‌గా తప్పుకుంది. ఇకనుంచి ఐపీఎల్‌ కొత్త టైటిల్‌ స్పాన్సరర్‌గా టాటా గ్రూప్‌ వ్యవహరించనుంది. వివో స్థానంలో టాటా రెండేళ్లకు లీగ్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ హక్కులను సొంతం చేసుకున్నట్టు ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ ధ్రువీకరించారు. ఈ ఒప్పందంతో భారత క్రికెట్ బోర్డుకు సుమారు రూ. 130 కోట్ల అదనపు ఆదాయం లభించనుంది. 2022, 2023 సీజన్‌ల స్పాన్సరర్‌గా టాటా రూ. 670 కోట్లను బీసీసీఐ కి చెల్లించనున్నట్టు సమాచారం. కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకున్నందుకుగానూ.. వివో  రూ. 454 కోట్లను నష్ట పరిహారంగా భారత క్రికెట్ బోర్డుకు ముట్టజెప్పనుంది.

దీనిద్వారా ఈ రెండేళ్లలో ఇతరత్రా ఫీజులతో కలిపి టైటిల్‌ స్పాన్సరర్‌షిప్‌ కింద బీసీసీఐకి రూ. 1124 కోట్ల ఆదాయం సమకూరనుంది. కానీ, వివో కొనసాగి ఉంటే రూ. 996 కోట్లు మాత్రమే వచ్చేవి. 2018-22 వరకు టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ హక్కులను వివో రూ. 2,200 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, 2020లో గాల్వాన్‌ ఘటన నేపథ్యంలో చైనా పట్ల వ్యతిరేకత వ్యక్తం కావడంతో అప్పుడు స్పాన్సర్‌షి్‌ప్ నుంచి వైదొలిగిన వివో.. 2021లో మళ్లీ ముందుకొచ్చింది. ఈ క్రమంలో.. 2023 వరకు కొనసాగాల్సి ఉంది. అయితే, గత కొంతకాలంగా స్పాన్సర్‌షి్‌ప్ కు సంబంధించి మార్పులుండొచ్చు అనే ఊహాగానాల నేపథ్యంలో టాటా బిడ్‌ను బోర్డు ఆమోదించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =