కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: 11040 కోట్లతో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ పామ్ పథకం

Approves National Mission on Edible Oils–Oil Palm with Rs 11040 Cr, Cabinet approves National Mission on Edible Oils, Cabinet nod for Rs 11040 cr mission to boost oil palm farming, Mango News, National Mission on Edible Oils, National Mission on Edible Oils–Oil Palm, oil palm farming, Promoting oil palm farming, Union Cabinet approves National Mission on Edible Oils, Union Cabinet Decisions

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీడియాకు వెల్లడించారు.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు:

  • నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ పామ్ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.11,040 కోట్లతో ఈ పథకం అమలు చేయనుండగా, కేంద్ర ప్రభుత్వం రూ.8,844 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ కొత్త కేంద్ర ప్రాయోజిత పథకం ద్వారా ముఖ్యంగా దేశంలోని ఈశాన్య ప్రాంతం మరియు అండమాన్ నికోబార్ దీవులపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. నూనె గింజలు మరియు ఆయిల్ పామ్ ఉత్పాదకతపై దృష్టి పెట్టడం, ఆయిల్ పామ్ రైతులకు ధర భరోసా కల్పించనున్నారు. అలాగే ఆయిల్ పామ్ సాగు చేయడానికి ప్రస్తుతం హెక్టారుకు ఇస్తున్న సబ్సిడీని రూ.12,000 నుండి రూ.29,000 కి పెంచారు.
  • ఈశాన్య ప్రాంతీయ వ్యవసాయ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం.
  • డబ్ల్యూటీఓ, పర్మినెంట్ మిషన్ ఆఫ్ ఇండియా, సెంటర్ ఫర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ లా (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) మరియు సెంటర్ ఫర్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ (ది గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్, జెనీవా) మధ్య ఎంవోయూకు కేబినెట్ ఆమోదం.
  • ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మరియు ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేటివ్ న్యూ డయాగ్నోస్టిక్స్ (ఎఫ్ఐఎన్డీ) స్విట్జర్లాండ్ మధ్య ఎంవోయూకు ఆమోదం.
  • విపత్తు నిర్వహణ, స్థితిస్థాపకత మరియు ఉపశమనరంగంలో సహకారంపై భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య ఎంవోయూకు ఆమోదం.
  • జియాలజీ రంగంలో సహకారంపై భారత్ మరియు అమెరికా మధ్య ఎంవోయూకు ఆమోదం.
  • ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మరియు జీఏఆర్డీపీ ఫౌండేషన్ ఆన్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ స్విట్జర్లాండ్ మధ్య ఎంవోయూకు ఆమోదం.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =